అదానీ గ్రూప్ కంపెనీల్లో స్టాక్స్ మానిప్యులేషన్, రికార్డుల్లో అవకతవకల వంటి సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ రోజు రోజుకు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. ఏ ఒక్క రోజు సైతం కోలుకున్న దాఖలాలు లేవు. నెల రోజుల్లోనే ఏకంగా రూ.12 లక్షల కోట్లు మార్కెట్ విలువను కోల్పోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మెజారిటీ స్టాక్స్ వరుసగా లోయర్ సర్క్యూట్ నమోదు చేశాయి. ఏడాది కనిష్ఠాన్ని తాకాయి.
ఫిబ్రవరి 24, శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ సెక్యూరిటీల ఎం క్యాప్ విలువ బీఎస్ఈలో రూ.7,15,986.97 కోట్లుగా ఉంది. జనవరి 24, 2023 రోజున అదానీ సెక్యూరిటీల విలువ రూ.19.2 లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం అది రూ.12 లక్షల కోట్లు కోల్పోవడం గమనార్హం. గరిష్ఠాల నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ ఏకంగా 70 శాతం మేర నష్ట పోయినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద సైతం భారీగా నష్టపోయారు. హిండెన్ బర్గ్ నివేదికకు ముందు ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 3కి చేరిన ఆయన.. ప్రస్తుతం టాప్ 20లో సైతం లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపద కోల్పోయిన బిలియనీర్ల జాబితాను ఇటీవలే విడుదల చేసింది బ్లూమ్ బర్గ్ నివేదిక. అందులో టాప్‌లో గౌతమ్ అదానీ ఉండగా.. ఆ తర్వాత ముకేశ్ అంబానీ, డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ ఉన్నారు.