Supreme court on Menstrual pain leaves : “పిటిషనర్.. మహిళా, శిశు సంక్షేమశాఖను సంప్రదించడం ఉత్తమం. అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టాలి. ఈ పిల్ విషయంలో ఇరు వర్గాల్లోనూ సమానంగా పాయింట్లు ఉన్నాయి. ఈ విషయంపై ఎలాంటి న్యాయపరమైన తీర్పులు ఇచ్చినా, అది మహిళలకు మంచిది కాదు అన్న వాదన నిజమే. పీరియడ్స్ కోసం సెలవులు ఇవ్వాలని మేము చెబితే.. సంస్థలు మహిళలనే తీసుకోవడం మానేసే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో.. పీరియట్స్ సమయంలో సెలవులు ఇవ్వాలన్నది కూడా సరైన వాదనే. ఇక ఇది విధానాల పరమైన అంశం. మేము ఈ పిల్‌ని ముట్టుకోము,” అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పరిద్వాలాలు కూడా ఉన్నారు.