Turkey Bans Layoffs: ఇటీవల సంభవించిన భూకంపం కారణంగా టర్కీ చెల్లాచెదురైంది. ఏకంగా 43 వేల మందికిపైగా మరణించారు. 6 లక్షలకుపైగా అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు లక్షా 50 వేల వరకు వాణిజ్య ప్రాంగణాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ కష్ట సమయంలో టర్కీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉద్యోగులకు, కార్మికులకు, దెబ్బతిన్న వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తోంది. ఇందుకోసం టెంపరరీ వేజ్ సపోర్ట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వారికి వేతనాలు ఇవ్వనుంది టర్కీ ప్రభుత్వం. ఇదే సమయంలో భూకంపం ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న 10 నగరాల్లో లేఆఫ్స్‌పై నిషేధం విధించింది. ఇది ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పొచ్చు.
టర్కీ భూకంపంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. దీంతో తీవ్రత మరింత పెరగకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడంలో భాగంగా ఇలా లేఆఫ్స్‌పై బ్యాన్ విధిస్తూ.. తాత్కాలిక వేతన మద్దతు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగాలు చేసే ప్రాంతాల్లో భవనాలు, ఆఫీసులు ధ్వంసమైన ప్రదేశాల్లో పనిచేసేవారికి ఇది ఉపయోగకరంగా ఉండనున్నట్లు దేశ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్న 10 రాష్ట్రాల్లో లేఆఫ్స్ ఉండవని స్పష్టం చేశారు.
Zomato Everyday: జొమాటో నుంచి ఇంటి భోజనం.. కొత్త సర్వీసులు షురూ.. రూ.89కే నోరూరించే విందు!
Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై అన్నీ వాట్సాప్‌లోనే.. టికెట్ల బుకింగ్ దగ్గర్నుంచి రీఛార్జిల వరకు ఇంకెన్నో..!
టర్కీ గతంలో కూడా లేఆఫ్స్ బ్యాన్ చేయడం సహా వేతన మద్దతు పథకాన్ని ప్రవేశపెట్టింది. కరోనా విజృంభించిన 2020లో ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడింది. అప్పుడు కూడా ఇలానే ఉద్యోగులకు బాసటగా నిలిచింది టర్కీ ప్రభుత్వం. ఇక టర్కీ రాజధాని అంకారాలో హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పునర్నిర్మాణం కోసం 100 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో రూ.8 లక్షల కోట్లకుపైగా అవసరం పడుతుందంట. ఈ మేరకు వ్యాపార వర్గాలు, ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. మరోవైపు.. ఆర్థిక వృద్ధి రేటును ఈ భూకంపం 1 నుంచి 2 శాతం వరకు తగ్గించొచ్చని తెలుస్తోంది.
Wipro నిర్ణయంపై చెలరేగిన దుమారం.. అన్నీ ఏకమై నిరసన.. ఇప్పుడేం చేస్తుందో?