Friday, March 24, 2023

romance mistakes, Romance Mistakes : ఇలా హస్తప్రయోగం చేస్తే సమస్యలు తప్పవు.. – what are the common mistakes men make in romance

వీడియోలు చూస్తూ..

చాలా వరకూ హస్తప్రయోగం చేసేవారిపై శృంగార వీడియోల ప్రభావం బానే ఉంటుంది. వారు ఆ వీడియోల్లో చేసినట్లుగా చేద్దామనుకుంటారు. కానీ, వీడయోలు వేరు. నిజ జీవితం వేరు. వారికి అంతగా ఉద్వేగం, అంత సమయం వరకూ ఉంటుంది. నిజంగా అంత సమయం ఉండదుగా. ఈ విషయాన్ని గమనించాలి. అలానే వారిలానే చేయాలనుకోవడం అవివేకం. అందుకే మీ ఎగ్జైట్‌మెంట్ కోసమే చేయడం మంచిది.

గట్టిగా నొక్కడం..

చాలా మంది పురుషులు శృంగార వీడియోలు, చిత్రాలు అనేక రకాలుగా ఉద్వేగం పొంది హస్తప్రయోగం చేస్తుంటారు. ఇవి చేసేటప్పుడు వారికి తెలియకుండా లాస్ట్‌లో ఎగ్జైట్‌మెంట్‌తో తమ పురుషాంగాన్ని గట్టిగా నొక్కుతుంటారు. దీంతో అక్కడి చర్మం బాగా దెబ్బతింటుంది. అలా కాకుండా జాగ్రత్తగా, నెమ్మదిగా చేయాలని చెబుతున్నారు. నిపుణులు.

Also Read : Pregnancy Romance : ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇలా అనిపిస్తే శృంగారం చేయొద్దొట..

టాయ్స్ వద్దు..

కొంతమంది టాయ్స్‌తో సుఖపడేందుకు ఆరాటపడతారు. మరికొంత మంది ఏవేవో వస్తువులతో సుఖపడాలని తొందరపడతారు. కానీ, ఇవన్నీ అంత మంచిది కాదు. వీటిని వాడడం వల్ల భవిష్యత్‌లో చాలా సమస్యలు రావొచ్చు. ఆ తర్వాత మీ పరిస్థితి ఆస్పత్రి వరకూ చేరొచ్చు. ఎప్పుడైనా సరే ప్రైవేట్ పార్ట్స్‌ని ఇబ్బంది పెట్టొద్దు. ఇది సున్నితమైన అవయవం. దీనిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోండి.

రుద్దడం..

అదే విధంగా రుద్దేటప్పుడు కూడా మరీ గట్టి రుద్దడం వల్ల అక్కడి చర్మం చాలా ఒత్తిడికి గురవుతుంది. దీంతో దానిపై వాపు, దద్దుర్లు, నొప్పి వస్తుంటుంది. దీనిని అవాయిడ్ చేయాలంటే నిదానంగా చేయాల్సిందే. ః

romance

శృంగారంలో తప్పులు

పరిశుభ్రత కూడా ముఖ్యమే..

అదే విధంగా మీ ప్రైవేట్ పార్ట్స్‌ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. లేదంటే, అనేక సమస్యలు వస్తాయి. ఇవి మూత్రమార్గంలోకి వెళ్ళి అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్‌కి కారణమవుతాయి. కాబట్టి, కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, ఏదైనా సమస్యగా అనిపిస్తే డాక్టర్‌ని కలవడం. ఇన్సర్స్, లోయర్స్ సరైనవి వేసుకోవడం. మరీ టైట్‌గా కాకుండా కాస్తా వదులుగా ఉండే బట్టలు వేసుకోవడం ఇలాంటివి చేస్తుంటే సమస్యలు రావు. వీటితో పాటు మీరు వేసుకునే ఇన్నర్స్ కూడా తడిగా లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎండలో ఆరబెట్టినవే వాడాలని గుర్తుపెట్టుకోండి. దీంతో చాలా వరకూ వైరస్, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.

Also Read : Heart attacks in Winter : గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

అక్కడ వద్దు…

అదే విధంగా చాలా మందికి మూడ్ రావడంతో తాము ఎక్కడ ఉన్నారో కూడా గమనించకుండా హస్తప్రయోగం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. కారు, వాహనాల్లో చేసేటప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు చేయాలనుకున్నప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకుని చేయడం మంచిది. దీని వల్ల మీరు చుట్టుపక్కల సొసైటీతో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వారిని ఇబ్బంది పెట్టిన వారవుతారు. ఇది మరిచిపోవద్దు.

రెగ్యులర్‌గా వద్దు..

అదే విధంగా, ఎక్కువగా హస్తప్రయోగం చేయడం కూడా అంత మంచిది కాదు. దీని వల్ల వారు నిజ జీవితంలో పార్టనర్స్‌తో శృంగారంలో పాల్గొన్నా ఆ ఆనందాని కంటే హస్తప్రయోగానికే అలవాటు పడే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు పర్లేదు కానీ, రెగ్యులర్‌గా ఇది చేయడం వల్ల అదో వ్యసనంలా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read : Leather sofa cleaning : లెదర్ సోఫాలను ఇలా క్లీన్ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయ్..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news