తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆశయాలను నెరవేర్చడానికి ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణ పత్రిక కీలక పాత్ర పోషించింది. మిగిలిన మీడియా సంస్థల నుంచి పరిమితంగానే సహకారం అందినా సొంత పత్రిక, టీవీల ద్వారా తమ గళాన్ని వినిపించగలిగారు. ప్రత్యేక తెలంగాణను సాధించడంతో సొంత మీడియా సంస్థలో కీలకంగా పనిచేశాయని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. టిఆర్‌ఎస్ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పార్టీ అజెండాను విస్తరించేందుకు సొంత మీడియా అవసరమని భావిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో పత్రికల్ని ప్రారంభించాలని నిర్ణయించారు. తెలుగుతో పాటు కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, హిందీ భాషల్లో సైతం పత్రికల్ని ప్రారంభించనున్నారు.
BREAKING NEWS