Mohan Lal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్‌కి కేరళ హైకోర్టు (Kerala High Court) నుంచి ఊహించని తీర్పు ఎదురైంది. అసలు అంత పెద్ద స్టార్ హీరో విషయంలో హైకోర్టు ఎందుకు జోక్యం చేసుకుంది. మోహన్ లాల్ ఎందుకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది అనే వివరాల్లోకి వెళితే.. ఈ స్టార్ హీరోని గత కొంతకాలంగా ఏనుగు దంతాల కేసు వెంటాడుతోంది. ఇదే కేసులో పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్టు హీరోకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో మోహన్ లాల్ హైకోర్టులో కేసు వేశారు.తన ఇంట్లో ఉన్న ఏనుగు దంతాలు చనిపోయిన ఏనుగువని, కాబట్టే తాను వాటిని ఖరీదు చేసి ఇంట్లో ఉంచుకున్నానంటూ పేర్కొన్నారు మోహన్ లాల్.
ఈ కేసు విషయంలో తనపై వేసిన ప్రాసిక్యూషన్‌ను కొట్టివేయాలని గతంలో పెరుంబవూరు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. అయితే అందుకు కోర్టు ఒప్పుకోలేదు. దీంతో ఆయన పెరుంబవూరు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలని కోరారు. అయితే హైకోర్టు అందుకు ఒప్పుకోలేదు. మోహన్ లాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఐటీ శాఖాధికారులు మోహన్ లాల్ ఇంటిలో సోదాలు చేశారు. అప్పుడు వారు రెండు ఏనుగు దంతాలను గుర్తించారు. అలంకరణంగా ఏనుగు దంతాలను పెట్టుకోవటం తప్పు కనుక దానిపై కేసు నమోదైంది. అయితే తాను అనుమతి తీసుకుని చట్ట ప్రకారమే ఏనుగు దంతాలను ఇంట్లో ఉంచుకున్నానని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకి మోహన్ లాల్ తెలిపారు.
కేరళ ప్రభుత్వం కూడా మోహన్ లాల్ చనిపోయిన ఏనుగు దంతాలనే కోనుగోలు చేశారని అన్నారు. అయితే ప్రభుత్వం తీరుని కోర్టు తప్పు పట్టింది. అదే ఓ సామాన్యుడు ఏనుగు దంతాలను ఇలా కోనుగోలు చేస్తే ఇలాగే మినహాయిస్తారా? అని కోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు హైకోర్టుకి కేసు వెళ్లింది. మరోసారి ప్రభుత్వం మరోసారి వివరణ ఇవ్వాలని కోరుతూ మోహన్ లాల్ పిటిషన్‌ను కొట్టేసింది.
ALSO READ:
ఆ సినిమా వదిలేసి పెద్ద తప్పు చేశాను.. రాజమౌళి మాటలకు గుండె పగిలింది: Mamta Mohandas
ALSO READ: కిందకి లాగే కొద్ది ఎదుగుతా.. నెపోటిజంపై కిరణ్ అబ్బవరం సెన్సేషనల్ కామెంట్స్
ALSO READ: Ram Charn – Mrunal Thakur: రామ్ చరణ్ సరసన బెంగాలీ బ్యూటీ మృణాల్ ఠాకూర్!
ALSO READ: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టైటిల్‌తో నాని..దిల్ రాజు ప్రయత్నం వర్కవుట్ అయ్యేనా!
ALSO READ: Ravi Teja: ముగ్గురు సూపర్‌స్టార్స్‌ను ఢీ కొట్టనున్న రవితేజ