Friday, March 31, 2023

Kanna joined in TDP: టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

కన్నా చేరిక సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు…. ఏపీ రాజకీయాల్లో కన్నాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పద్ధతి, నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. టీడీపీతోనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందని భావించి కన్నా టీడీపీలోకి వచ్చారని చెప్పారు. కన్నాతో పాటు గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితమే బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ మార్పునకు కారణం సోము వీర్రాజే అన్నారు. అయితే నిజానికి తొలుత కన్న జనసేనలోకి వెళ్తారని కూడా అందరూ భావించారు. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్… కన్నా ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా చర్చలు కూడా జరిపారు. దీంతో పక్కాగా కన్నా.. పవన్ వెంట నడుస్తారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా… టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు జిల్లాలో బలమైన కాపు నాయకుడిగా కన్నాకు పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పని చేశారు.

Source link

Latest news
Related news