దేశీయ ప్రయాణాలకు కనిష్టంగా రూ.1,199కే టికెట్ అందిస్తోంది గో ఫస్ట్. అయితే, అంతర్జాతీయ విమానాలకు కనిష్టంగా రూ.6,139గా టికెట్ ధరను నిర్ణయించినట్లు తెలిపింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ప్రయాణాల సమయం మార్చి 12 నుంచి సెప్టెంబర్ 30, 2023 మధ్య చేసే వాటికే బుకింగ్స్ ఉంటాయని పేర్కొంది.
ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్..
దేశీయ దిగ్గజ పౌర విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ (Indigo Airlines) బుధవారం కేవలం రూ.2,093కే విమాన టికెట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆ మరుసటి రోజునే గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ ఈ మేరకు కొత్త ఆఫర్ తీసుకు రావడం గమనార్హం. ఇండిగో సేల్ ఫిబ్రవరి 25 వ తేదీ వరకు కొనసాగనుంది. దీని ట్రావెల్ పీరియడ్ మార్చి 13 నుంచి అక్టోబర్ 13, 2023 వరకు ఉంటుంది.
భారీగా పెరిగిన విమాన ప్రయాణికులు..
కరోనా మహమ్మారి కారణంగా భారీగా దెబ్బతిన్న ఏవియేషన్ సెక్టార్ ప్రస్తుతం కోలుకుంటోంది. డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ ఈ ఏడాది 2023, జనవరి లో 125.42 లక్షలకు చేరింది. ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే రెండింతలు పెరగడం గమనార్హం. ఈ వివరాలను ఫిబ్రవరి 20న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే, ఇది డిసెంబర్ 2022తో పోలిస్తే 1.5 శాతం తక్కువ మంది ప్రయాణాలు చేశారు. డిసెంబర్‌లో 127.35 లక్షల మంది ప్రయాణికులు విమాన ప్రయాణాలు చేశారు. అయితే, కోవిడ్ ముందు స్థాయికి ఇంకా చేరుకోలేదు. 2020 జనవరిలో డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ 127.83 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యాలకు చేరవేశాయి.