Thursday, March 30, 2023

eps membership status, EPFO అధిక పెన్షన్‌కు అర్హులు ఎవరు? మీ స్టేటస్ తెలుసుకోండిలా.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే! – epfo higher pension how to check your eps membership status to receive higher pension


EPFO: దేశ సర్వోన్నత న్యాయ స్థాయం ఇచ్చిన తీర్పు అమలులో భాగంగా ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చి అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న ఉద్యోగులకు అధిక పెన్షన్ ప్రయోజనాలు కల్పిస్తోంది ఈపీఎప్ఓ. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు సర్క్యూలర్లు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు? ఎవరికి అధిక పింఛను ప్రయోజనం వర్తిస్తుంది? అనే సందేహాలు ఉండే ఉంటాయి. చాలా మంది ఉద్యోగులు 2014కు ముందు నుంచి పని చేస్తున్న వారు ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ నుంచి అధిక పెన్షన్ పొందేందుకు తాము అర్హులమేనా అనే ఆందోళనలో ఉన్నారు. గతంలోనే సుప్రీం కోర్టు సెప్టెంబర్ 1, 2014 కన్నా ముందు ఈపీఎస్ సభ్యులుగా ఉన్న ఉద్యోగులందరూ అర్హులేనని తీర్పు వెలువరించింది. అయితా చాలా మందికి సెప్టెంబర్ 1, 2014 ముందు నుంచే ఈపీఎస్ సభ్యులమా అనే సందేహం ఉంది.

ఈ క్రమంలో ఈపీఎస్ ద్వారా అధిక పెన్షన్ కోసం మనం అర్హులేమానే లేదా ? స్టేటస్ తెలుసుకోవడం ఎలా అనేది చాలా మంది ఉద్యోగుల్లో కదులుతున్న ప్రశ్న. ఉద్యోగులు తమ స్టేటస్ తెలుసుకునేందుకు ఈపీఎఫ్ఓ మెంబర్ ఈ-సేవా పోర్టల్ ద్వారా తమ స్టేటస్ తెలుసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఉన్న వివరాలు అన్నీ సరిగ్గా ఉండాలి. ఎందుకంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది 2014లోనే ప్రవేశపట్టారు. ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పటికీ ఈ యూఏఎన్ నంబర్ ఒకటే ఉంటుంది. అయితే, ప్రావిడెంట్ ఫండ్ నంబర్ మారుతుంటుంది. ఈ యూఏఎన్ ప్రవేశపెట్టేందుకు ముందు ఎవరైనా ఉద్యోగి సంస్థ మారినట్లయితే.. ఈపీఎఫ్ఓ రికార్డులు అప్డేట్ చేయకపోతే సమస్య ఏర్పడుతుంది.

ఈ క్రమంలో ఎంప్లాయిమెంట్ లేబర్ అండ్ బెనిఫిట్స్ ఖైతాన్ అండ్ కో పార్ట్నర్ అన్షుల్ ప్రకాశ్ పలు విషయాలు వివరించారు. ఉద్యోగుల అర్హతను ఈపీఎఫ్ఓ పోర్టల్ నుంచి తీసుకున్న వివరాలతో నిర్ణయిస్తారని తెలిపారు. ఈపీఎఫ్ఓ మెంబర్ ప్రోఫైల్ ఉద్యోగి ఈపీఎస్ స్కీమ్‌లో చేరిన ఎన్‌రోల్‌మెంట్ తేదీ వంటి వివరాలు ఉంటాయి. మరోవైపు.. ఉద్యోగులు సెప్టెంబర్ 1, 2014 కన్నా ముందే ఈపీఎస్ సభ్యులగా ఉన్న సందర్భంలో జురిస్డిక్షనల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ నుంచి తమ మెంబర్ షిప్ స్టేటస్ తెలుసుకునే వీలుంంటుందన్నారు.

స్టేటస్ తెలుసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

  • మెంబర్ ఈ-సేవీ పోర్టల్ ttps://unifiedportal mem.epfindia.gov.in/memberinterface/లోకి వెళ్లాలి
  • మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్, పాస్‌వర్డ్‌, క్యాప్చా కోడ్‌తో లాగిన్ కావాలి
  • లాగిన్ అయిన తర్వాత View ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత సర్వీస్ హిస్టరీపై నొక్కాలి
  • సర్వీస్ హిస్టరీ అనేది ఉద్యోగులు పని చేసిన సంస్థల జాబితాను చూపిస్తుంది. అందులో ఈపీఎస్ స్కీమ్‌లో చేరిన తేదీని తెలుసుకోవచ్చు.
  • మీ డేట్ ఆఫ్ జాయినింగ్ సెప్టెంబర్ 1, 2014 ముందు ఉన్నట్లయితే మీరు అధిక పెన్షన్ పొందేందుకు అర్హులు. ఆ తేదీ తర్వాత మరో ఆర్గనైజేషన్ మారినప్పటికీ వీరు అర్హులే.
  • మరోవైపు.. ఒకవేళ సెప్టెంబర్ 1, 2014 రోజున లేదా ఆ తర్వాత ఈపీఎస్‌లో సభ్యులుగా చేరితే అర్హులుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే సర్వీస్ హిస్టరీ అప్డేట్ కాకపోయి ఉండవచ్చు. ఒక వేళ మీ వద్ద అధిక పెన్షన్ కోసం అర్హులుగా ఏవైనా ఆధారాలు ఉంటే ఈపీఎఫ్ఓ పోర్టల్‌ ద్వారా సబ్మిట్ చేసి పొందవచ్చు.

ఉద్యోగులకు EPFO గుడ్‍న్యూస్.. అధిక పెన్షన్‌ కోసం మరో అవకాశం.. ఇలా అప్లై చేసుకోండి?రైతులకు అదిరే శుభవార్త.. ఈ వారమే PM Kisan డబ్బులు.. స్టేటస్ చెక్ చేసుకోండిలా..!‘NPS నిధులు ఇచ్చేది లేదు.. ఆశలు పెట్టుకోవద్దు’.. ఆ రాష్ట్రాలకు కేంద్రం ఝలక్..!



Source link

Latest news
Related news