Monday, March 20, 2023

cancel protect, టికెట్ క్యాన్సల్ చేస్తున్నారా? Paytmతో 100 శాతం రీఫండ్ పొందొచ్చు.. ఎలాగంటారా? – paytm new feature cancel protect will ensure complete refund against flight ticket cancellation


Paytm: ప్రతి ఒక్కరి జీవితంలో ప్రయాణాలు అనేవి సర్వ సాధారణం. అయితే ఒక్కోసారి అనుకోని సంఘటనలు ఎదురై ఆ ప్రయాణాలను రద్దు చేసుకోవడం లేదా వాయిదా వేసుకోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న విమానం లేదా బస్ టికెట్లను రద్దు చేసుకుంటాం. అలా చేసుకున్న సందర్భంలో సర్వీస్ ప్రొవైడర్లు కొత్త సర్వీస్ ఛార్జీలను తీసుకుని మిగిలిన డబ్బులను రీఫండ్ చేస్తుంటారు. అయితే, మీరు ఇకపై పూర్తిగా 100 శాతం రీఫండ్ పొందవచ్చు. అది ఎలాగంటే? పేటీఎం తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో. వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ (OCL) గురువారం పేటీఎంలో క్యాన్సల్ ప్రొటెక్ట్ ‘Cancel protect’ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రకటించింది. దీంతో ఫ్లైట్ టికెట్ క్యాన్సల్ చేసినప్పుడు పూర్తిగా డబ్బులు రీఫండ్ చేసుకోవచ్చని పేర్కొంది.

ఈ ఫీచర్ ద్వారా పేటీయం యాప్ యూజర్లు టికెట్ క్యాన్సల్ చేసినప్పుడు విమానయాన సంస్థలు, బస్ ఆపరేటర్లు వేసే ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్లకు ఫ్లైట్ టికెట్స్ కోసం రూ.149కి బస్ టికెట్ కోసం రూ.25తో లభిస్తోంది. ‘క్యాన్సల్ ప్రొటెక్ట్ ఫీచర్‌తో కస్టమర్లు 100 శాతం రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఫ్లైట్ బయలుదేరే సమయానికి 24 గంటల ముందు లేదా బస్ బయలుదేరే 4 గంటల నుంది టికెట్ రద్దు చేసుకున్నవారికే వర్తిస్తుంది. క్యాన్సల్ ప్రొటెక్ట్‌లో రీఫండ్‌పై ఎలాంటి పరిమితి లేదు. టికెట్ క్యాన్సల్ చేసిన క్షణాల్లోనే వారి ఖాతాల్లో రీఫండ్ సొమ్ము జమ అవుతుంది.’ అని ఓ ప్రకటనలో తెలిపింది పేటీఎం.

ఈ విషయంపై పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ.. తాము తమ యాప్‌పై కస్టమర్ ఫ్రెండ్లీ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. భారతీయ ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా బుకింగ్స్ సమస్యలను తగ్గించేలా ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ఎవరైతే తమకు నచ్చినట్లుగా, నచ్చిన సమయంలో ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ క్యాన్సల్ ప్రొటెక్ట్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. టికెట్ క్యాన్సలేషన్‌తో పాటు ట్రావెల్ బుకింగ్స్‌పై డిస్కౌంట్లు వంటివి గ్రేట్ డీల్స్ అందిస్తున్నామని తెలిపారు.

ఇటీవలే ఫిబ్రవరి 15, 2023న కీలక ప్రకటన చేసింది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. యూపీఐ లైట్ ఫీచర్‌లను లాంఛ్ చేస్తున్నట్లు తెలిపింది. స్మాల్ వాల్యూమ్ యూపీఐ ట్రాన్సాక్షన్ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో జట్టు కట్టినట్లు పేర్కొంది. దీంతో ఒక్క క్లిక్‌తో క్షణాల్లో పేమెంట్స్ చేసేయొచ్చని, బ్యాంకుతో పని లేకుండానే చేయొచ్చని పేర్కొంది. ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ బ్యాంకు స్టేట్‌మెంట్‌లో కనిపించదని స్పష్టం చేసింది.
Paytm యూజర్లకు అదిరే ఫీచర్.. సింగిల్ క్లిక్‌తో పేమెంట్స్.. బ్యాంక్‌తో సంబంధం లేకుండానే..!Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై అన్నీ వాట్సాప్‌లోనే.. టికెట్ల బుకింగ్ దగ్గర్నుంచి రీఛార్జిల వరకు ఇంకెన్నో..!Srivari Arjitha Seva Tickets తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు.. నేటి సాయంత్రం నుంచే ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలంటే…



Source link

Latest news
Related news