Delhi Mayor election 2023: మూడుసార్లు ఎన్నిక వాయిదా, గొడవలు, విమర్శలు, వివాదాల తర్వాత ఎట్టకేలకు ఢిల్లీకి మేయర్ వచ్చారు. ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party – AAP)కి చెందిన షెల్లీ ఒబెరాయ్ (Shelly Oberoi).. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) మేయర్‌గా ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation of Delhi) హౌస్‍లో బుధవారం మేయర్ ఎన్నిక జరిగింది. భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దీంతో ఢిల్లీ మేయర్ పీఠం.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆప్ వశమైంది. మేయర్ ఎన్నిక కోసం సమావేశం జరగడం ఇది నాలుగోసారి. గత మూడుసార్లు ఆప్, బీజేపీ మధ్య గొడవలతో మేయర్ ఎన్నిక జరగలేదు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత నాలుగోసారి ఎన్నిక తంతు పూర్తయింది. పూర్తి వివరాలు ఇవే.