Thursday, March 30, 2023

ఎవరీ పవన్ ఖేరా? ప్రధాని మోదీని ఏమన్నాడని అరెస్ట్ చేశారు?-why was congress leader pawan khera arrested


Why Pawan Khera arrested? ఎందుకు అరెస్ట్?

అస్సాంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస నేత పవన్ ఖేరా (Pawan Khera) మాట్లాడుతూ.. హిండెన్ బర్గ్ నివేదికలో గౌతమ్ ఆదానీపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని (joint parliamentary Committee JPC) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘విపక్షాల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు పీవీ నరసింహరావు జేపీసీని ఏర్పాటు చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి కూడా జేపీసీని ఏర్పాటు చేశారు. మరి హిండెన్ బర్గ్ నివేదికపై జేపీసీని ఏర్పాటు చేయడానికి నరేంద్ర ‘గౌతమ్’ దాస్ మోదీ.. సారీ.. నరేంద్ర దామోదర దాస్ మోదీ కి ఏంటీ సమస్య? (Narendra Gautam Das…sorry Damodardas…Modi)’’ అని పవన్ ఖేరా (Pawan Khera) వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ (PM Modi) పూర్తి పేరు నరేంద్ర దామోదర దాస్ మోదీ కాగా, పవన్ ఖేరా నరేంద్ర గౌతమ్ దాస్ మోదీ అని అన్నారు. గౌతమ్ ఆదానీ, మోదీ (PM Modi) కి సన్నిహితుడైన మిత్రుడనే అర్థం స్ఫురించేలా ఆయన అలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైననే పవన్ ఖేరాపై అస్సాంలో, యూపీలో కేసులు నమోదయ్యాయి. అత్యంత గౌరవనీయ పదవిలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi) ని పవన్ ఖేరా అవమానించారని, తన తండ్రి పేరు స్థానంలో వేరే వ్యక్తి పేరును కావాలనే ప్రస్తావించారని ఆ ఫిర్యాదుల్లో బీజేపీ (BJP) పేర్కొంది. దాంతో, పవన్ ఖేరా అరెస్ట్ కు రంగం సిద్ధమైంది.



Source link

Latest news
Related news