APSRTC : ఏపీఎస్‌ఆర్‌టీసీ (APSRTC)లో.. 5418 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీ అంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో డ్రైవర్ ఉద్యోగాలు అత్యధికంగా 2740 పోస్టులు ఉన్నాయని.. అలానే కండక్టర్ 2678 ఉద్యోగాలను భర్తీ చేస్తారంటూ ప్రచారం చేశారు. కండక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత 10వ ఉత్తీర్ణత ఉండాలి.. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే 10వ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలంటూ కూడా ప్రచారం చేశారు.
అయితే.. ఈ ప్రచారాన్ని APSRTC ఖండించింది. తాము ఎలాంటి జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని.. ఈ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఏపీఆర్టీసీలో డ్రైవర్ , కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కొందరు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. పైగా వాట్సాప్‌లో APSRTC వెబ్‌సైట్‌లో డొమైన్‌ను యాడ్ చేస్తూ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని APSRTC ఖండించింది. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
APSRTC స్పష్టత ఇస్తూ విడుదల చేసిన ప్రకటన