ఇదేమైనా ఇంగ్లండా?
Bihar CM Nitish Kumar: అమిత్ కుమార్ ఎక్కువగా ఇంగ్లిష్ పదాలు వాడడంపై సీఎం నితీశ్ అసహనం వ్యక్తం చేశారు. “మీరు ఎక్కువగా ఇంగ్లిష్ పదాలు వాడుతుండడం గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మీరు బిహార్‌లో పని చేస్తున్నారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయం చేస్తున్నారు. రైతులకు సూచనలు ఇవ్వడానికి మేం ఇక్కడికి పిలిచాం. మీరేమో ఇంగ్లిష్‍లో మాట్లాడుతున్నారు. ఇది ఏమైనా ఇంగ్లాండా? ఇది ఇండియా, బిహార్” అని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. దీంతో ఆడిటోరియంలో ఉన్న వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు.