ఐఐటీహెచ్‌లోని మొదటి గ్రాడ్యుయేషన్ బ్యాచ్ అయిన బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థుల్లో 82% మంది ప్లేస్‌మెంట్ దక్కించుకున్నారు. సెమిస్టర్ లాంగ్ ఇంటర్న్‌షిప్‌లు సైతం గతం కన్నా పెరిగాయి. బ్లెండ్ 360 కంపెనీ అత్యధికంగా ఐఐటీహెచ్ విద్యార్థులను రిక్రూట్‌చేసుకుంది. యాక్సెంచర్ జపాన్, డెన్సో, ఫ్లిప్‌కార్ట్, మోర్గాన్ స్టాన్లీ, ఎన్‌టీటీఏటీ, ఒరాకిల్, స్ప్రింక్లర్, సుజుకి మోటర్స్ కార్పొరేషన్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, టీఎస్‌ఎంసీ, జొమా టో తదితర సంస్థలు ఈ క్యాంపస్ డ్రైవ్‌లో ఉద్యోగులను నియమించుకున్నాయి.
BREAKING NEWS
Hyderabad : ఐఐటీ – హైదరాబాద్ (IIT Hyderabad) విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో సత్తాచాటారు. ఈ ఏడాది తొలి విడత ప్లేస్‌మెంట్స్‌లో ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులు మంచి వేతన ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది. ఐఐటీహెచ్ విద్యార్థులు సాధించిన వార్షిక సగటు వేతన ప్యాకేజీ రూ.19.49 లక్షలుగా ఉండటం విశేషం.