ఇదిలా ఉంటే.. తాజాగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన రణ్‌బీర్.. తనకున్న అతిపెద్ద అభద్రత గురించి రివీల్ చేశాడు. ఆ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణబీర్ మాట్లాడుతూ.. ‘నాకున్న బిగ్గెస్ట్ ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్ ఏంటంటే.. నా పిల్లలు 20, 21 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నాకు 60 ఏళ్లు ఉంటాయి. నేను వారితో ఫుట్‌బాల్ ఆడగలనా? అసలు నేను ఉంటానా? వారితో పరుగెత్తగలనా? అని సందేహం వ్యక్తం చేశాడు.
అయితే రణ్‌బీర్, ఆలియా పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ప్రెగ్నెన్సీ ప్రకటించారు. నిజానికి చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 14న ముంబైలో రణ్‌బీర్ నివాసంలో జరిగిన సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. నవంబర్ 6న ఆలియా భట్ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఇక తనకు వెల్‌కమ్ చెప్తూ ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పాప పేరును ‘రాహా’ అని ప్రకటించిన ఆలియా.. ఆ పేరును తండ్రి రణ్‌బీర్ సెలెక్ట్ చేసినట్లు చెప్పింది. రాహా అంటే స్వచ్ఛమైన రూపంలో దైవిక మార్గం అని.. అనేక రకాల అర్థాలను కూడా ఈ సందర్భంగా పోస్టు చేసింది.
ఇక రణబీర్, ఆలియా ఇటీవల అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో ‘బ్రహ్మాస్త్ర : పార్ట్ 1- శివ’ చిత్రంలో కనిపించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆలియా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ చిత్రంలో రణవీర్ సింగ్, ధర్మేంద్ర, జయా బచ్చన్‌లతో కలిసి నటించనుంది. ఇక రణ్‌బీర్.. లవ్ రంజన్ డైరెక్టర్‌తో ఇంకా పేరుపెట్టని రొమాంటిక్ కామెడీ చిత్రంలో శ్రద్ధా కపూర్‌తో పాటు నటించనున్నాడు. దీంతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘యానిమల్’ కూడా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇందులో రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్‌తో కలిసి నటించనున్నారు.
- Read Tollywood Updates & Telugu News