‘ఆర్‌ఆర్ఆర్’ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే ఏ సినిమా పట్టాలెక్కలేదు. డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన #NTR30 పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అయితే, కొరటాల ఈ మూవీ స్క్రిప్ట్‌ను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈలోగా ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడు జూనియర్. భార్య, పిల్లలతో కలిసి నెల రోజుల పాటు వెకేషన్ గడపనుండగా.. తిరిగొచ్చిన తర్వాతే కొరటాలతో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.
BREAKING NEWS