Friday, March 31, 2023

Mandous Cyclone : ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. పూర్తి వివరాలివే

Mandous Cyclone : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మాండూస్‌ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం సెలవులు ఇవ్వాలని.. ఈ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలను హెచ్చరించారు.

Work From Home : 2023 డిసెంబర్‌ వరకూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం
Government : ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వర్క్‌ ఫ్రం హోం (Work From Home) వెసులుబాటునుంచి ఆఫీసులకు వెడుతున్న పలు స్పెషల్ ఎకనామిక్ జోన్ల(SEZ)లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల యూనిట్ల (SEZ)లో ఉన్న ఐటీ, ఐటీ ఆదారిత కంపెనీల్లోని 100 శాతం మంది ఉద్యోగులకు ఇంటి నుండి పూర్తి పనిని అనుమతించింది. వచ్చే ఏడాది డిసెంబరు (2023 డిసెంబర్) వరకు ఇంటినుంచే పని (Work From Home) చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ కొన్ని షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.

మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. ఒక యూనిట్ తన ఉద్యోగులను ఇంటి నుండి లేదా సెజ్‌ వెలుపల ఏ ప్రదేశం నుండైనా పనిచేసుకోవడానికి అనుమతించవచ్చు. ప్రస్తుతానికి సెజ్‌లలో మొత్తం ఉద్యోగుల్లో సగం మంది, గరిష్టంగా ఒక ఏడాది పాటు ఇంటి నుండి పని (Work From Home) చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే.

Railway : 10వ తరగతి అర్హతతో సెంట్రల్‌ రైల్వేలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
సెజ్‌లలోని యూనిట్ యజమానులు సంబంధిత జోన్‌ల డెవలప్‌మెంట్ కమిషనర్‌కు సమాచారం అందించి సంబంధిత ఆమోద పత్రం పొందాలి. భవిష్యత్తులో ఇంటి నుండి పని ప్రారంభించాలనుకునే యూనిట్లు ఇంటి నుండి పని ప్రారంభించే తేదీకి లేదా ముందు మెయిల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరెవరు వర్క్‌ ఫ్రం హోం (Work From Home) చేస్తున్నారనేది బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడానికి ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు లేదా ఇతర పరికరాలను అందించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సదరు యూనిట్‌ ఉత్పత్తి చేసే ఉత్పత్తుల ఎగుమతి ఆదాయాన్ని సంబంధిత యూనిట్ ఉద్యోగి నిర్ధారించాల్సి ఉంటుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

NPCIL : న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో 243 జాబ్స్‌.. ఈ అర్హతలుంటే అప్లయ్‌ చేసుకోవచ్చు

Latest news
Related news