వీణా కపూర్‌ను ఆమె కొడుకు దారుణంగా చంపేశాడని తెలియగానే బాలీవుడ్ వర్గాలు (Bollywood) షాకయ్యాయి. డబ్బు కోసం ఇంత దారుణం ఎలా చేశాడని అందరూ వా పోతున్నారు.
BREAKING NEWS
డబ్బు మనుషుల మధ్య దూరాన్ని పెంచటమే కాదు.. బంధాలను అనుబంధాలను చంపేస్తుందని సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలో కొన్ని ఘటలను వార్తలు రూపంలో చూసి ఉండొచ్చు. కాగా.. ఇప్పుడు అలాంటి దారుణం ముంబైలో జరిగింది. ఓ సీనియర్ నటిని ఆమె కన్న కొడుకు దారుణంగా హతమార్చాడు. సీనియర్ నటి వీణా కపూర్ (74) (Veena Kapoor). విషయం తెలియటంతో బాలీవుడ్ వర్గాలు నిర్ఘాంత పోతున్నాయి. అసలు వీణా కపూర్‌కి ఇద్దరు కొడుకు. అందులో ఓ కొడుకైన సచిన్ చంపటానికి కారణం ఏదో కాదు.. ఆస్తి గొడవలే (Property dispute). వీణా కపూర్ మరో కుమారుడు అమెరికాలో ఉంటాడు. అతనికి అనుమానం రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూపీ లాగటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.