Oath taking on 12th Dec: 12న ప్రమాణం
సోమవారం, డిసెంబర్ 12న భూపేంద్ర మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 12 మంది వరకు మంత్రులుగా ప్రమాణం చేయవచ్చని సమాచారం. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరు కానున్నారు. గాంధీ నగర్ లోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ నూతన ఎమ్మెల్యేల సమావేశానికి పార్టీ అధిష్టానం తరఫన పరిశీలకులుగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, కర్నాటక మాజీ సీఎం యెడియూరప్ప, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా హాజరయ్యారు. ఢిల్లీలోని అగ్ర నేతలను కలవడానికి భూపేంద్ర పటేల్, గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ఢిల్లీకి పయనమయ్యారు.