Mandous Cyclone బంగాళా ఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను పట్ల ముఖ్యంగా రాయలసీమ,దక్షిణ కోస్తాల జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుండి తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై తిరుపతి, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైయస్సార్ కడప జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మరోవైపు మాండస్ తుఫాను నేపథ‌్యంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించడానికి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్ సూచించారు.
Source link
BREAKING NEWS