కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్ 2’ కంటే ఎక్కువ బిజినెస్ చేస్తోంది. ఐదవ వారంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రంగా ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ రికార్డును అధిగమించింది. ఆరోవారం వీకెండ్‌లో భారీగా కలెక్ట్ చేసిన భారతీయ చిత్రం ఇప్పటి వరకు ‘కాంతార’ తప్ప మరోటి లేదు. అలాగే ‘గదర్ : ఏక్ ప్రేమ్ కథ’ పేరు మీదున్న ఎనిమిదో వారం రికార్డును 50 శాతానికి పైగా తేడాతో బద్దలు కొట్టింది. మొదటి 10 వారాల్లో అత్యధిక వీక్లీ రికార్డ్స్ కలిగిన ‘బాహుబలి 2’చిత్రాన్ని కూడా ‘కాంతార’ అధిగమించింది.
కర్నాటకలో 8వ వారంలో 300కి పైగా థియేటర్లలో ప్రదర్శించబడింది. ఆ రాష్ట్రంలో ఇదే అత్యుత్తమం కాగా.. కన్నడ భాషలో రూపొందిన ఒక కన్నడ చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డ్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ పేరిట ఉంది.
ఇక అత్యంత ప్రాఫిటబుల్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ కంటే కూడా మెరుగైన లాభాలను ఆర్జించిన భారతీయ చలన చిత్రంగా నిలిచిన ‘కాంతార’.. పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కు ఊహించని స్థాయిలో ప్రాఫిట్స్ తెచ్చి పెట్టింది.
హిందీ డబ్బింగ్ వెర్షన్ నుంచి మొదటి రోజున ఒక డబ్బింగ్ చిత్రంగా ‘కాంతార’ అత్యధికంగా రూ. 1 కోటి నెట్ వాల్యూ వసూల్ చేసింది.
అంతేకాదు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ జానపద కథగా ‘కాంతార’ నిలిచింది. ఇక ‘కాంతార’ మూవీ ఇప్పటికీ ఇండియా వైడ్‌గా చాలా థియేటర్లలో రన్ అవుతోంది. స్థానిక భాషల్లో చూడాలనుకుంటే.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా చూడవచ్చు.
- Read Tollywood Updates & Telugu News