పవన్ కళ్యాణ్ ప్రచార వాహనంపై ఏపీ రవాణా శాఖ అధికారులు కూడా స్పందించారు. వాహనాలకు మిలట్రీ రంగుల వినియోగంపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, వాహనాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ డిప్యూటీకమిషనర్ సంకా ప్రసాదరావు చెప్పారు. వాహనం తయారు చేసిన ఛాసిస్ కమర్షియల్ వాహనానికి సంబంధించినదా, రవాణా వాహనానికి సంబంధించినదా అనేది కూడా చూస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తప్పవని చెప్పారు. పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడితే తప్ప వాహనం పొడవు, వెడల్పు, ఎత్తు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుస్తుందన్నారు.
BREAKING NEWS