ఇప్పటివరకు ఇదే రికార్డు..భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే 2022 నవంబర్‌లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగినట్లు ఫాడా వివరించింది. టూవీలర్, ప్యాసింజర్, కమర్షియల్ వెహికిల్స్ ఇలా అన్ని సిగ్మెంట్లలో విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు FADA తెలిపింది. గత నెలలో వాహన రిటైల్ విక్రయాలు మొత్తంగా 26 శాతం వృద్ధి కనిపించిందని వెల్లడించింది. టూ వీలర్ విక్రయాలు 24 శాతం పెరగ్గా.. 3 వీలర్ అమ్మకాలు 80 శాతం పెరిగినట్లు ఫాడా తెలిపింది. ఇక ప్రైవేట్ వాహనాలు, కమర్షియల్ వాహనాల విక్రయాలు వరుసగా 21, 33 శాతం పెరిగినట్లు పేర్కొంది.
టాటా కలల కారు నానో మళ్లీ వచ్చేస్తుంది.. ఈసారి కొత్త అవతారంలో.. అబ్బురపరిచే ఫీచర్లు!
BS-IV నుంచి BS-VI కు మారిన 2020 మార్చి నెలను పక్కనబెడితే.. ఈ నవంబర్ నెలలోనే విక్రయాలు ఇప్పటివరకు అత్యధికమని వాహన సమాఖ్య వివరించింది. అయితే నవంబర్ నెలలో పెళ్లిళ్ల సీజన్ ఉండటంతోనే విక్రయాలు ఇలా పెరిగినట్లు అంచనా వేస్తోంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో డిసెంబర్ నెలలోనూ వాహన విక్రయాలు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఎదురులేని టాటాలు.. ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి.. భారత్‌కు ఇక ఆ సమస్య తీరినట్లే!
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇప్పట్లో కష్టమేనా?
ఫాడా వివరాల ప్రకారం.. నవంబర్ నెలలో మొత్తంగా 23 లక్షల 80 వేల 465 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో టూ వీలర్ వాహనాలు 18,47,708 ఉన్నాయి. ఇక 2021 నవంబర్‌లో మొత్తం వాహన విక్రయాలు 18,93,647 గానే నమోదయ్యాయి. ఇందులో టూ వీలర్స్ 14,94,797.
ఇదే క్రమంలో ఆటో కంపెనీలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా నవంబర్ నెలలో తమ విక్రయాలు రికార్డు స్థాయిలో ఉంటాయని భావిస్తున్నాయి. కియా ఇండియా, హోండా కార్స్, స్కోడా, MG మోటార్ గత నెలలో సేల్స్‌లో మంచి వృద్ధి కనబరిచాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, నిస్సాన్ మాత్రం నిరాశపరిచాయి. ఇదే నేపథ్యంలో పండగ సీజన్, పెళ్లిళ్ల సీజన్‌తో ఈ నవంబర్‌లో తమ విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నాయి.
- Read Latest Business News and Telugu News
Also Read: అదానీ, అంబానీదే హవా.. 100 సంస్థల సంపద అన్ని లక్షల కోట్లా.. ఐదేళ్లలోనేపీఎఫ్ ఎలా విత్‌డ్రా చేసుకోవాలి.. ఇప్పుడు ఎంత వస్తుందో తెలుసా?