విద్యాసంస్థలకు సెలవు
Cyclone Mandous: మాండస్ తుఫాను ప్రభావం కారణంగా చెన్నై, తిరువల్లూరు, చెంగల్పట్టు, వేలూరు, రాణిపెటై, కాంచీపురంతో పాటు మొత్తంగా 12 జిల్లాల్లోని పాఠశాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. సహాయక చర్యల కోసం 13 జిల్లాల్లో ఎన్‍డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. అన్ని పార్కులు, ప్లే గ్రౌండ్‍లను మూసేయాలని పురపాలక సంఘాలను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,093 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తమిళనాడు అధికారులు చెప్పారు.