నెలవారీ EMI ఎంత పెరిగింది.. వామ్మో 23 శాతం ఎక్కువ కట్టాలా? సామాన్యులపై పెను భారం..
కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో టాటా నానో కారును తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ యోచిస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా నివేదించింది. ఇప్పుడు సరికొత్త లుక్‌లో గణనీయమైన మార్పులు చేసి తీసుకురానుందని సమాచారం.
ఉద్యోగులను పీకేసిన 20 దిగ్గజ కంపెనీలు.. దిక్కుతోచని స్థితిలో వేలమంది.. ఐటీకి ఇక కష్టమేనా?
టాటా మోటార్స్ ఇప్పటికే కర్వ్ (Curvv), అవిన్యా (Avinya) వంటి కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించింది కూడా. వచ్చే ఐదేళ్లలో టాటా మోటార్స్.. 10 ఎలక్ట్రిక్ మోడల్ కార్లను విడుదల చేయాలని చూస్తోందట. ఇందులో టాటా నానో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫీచర్లు కూడా లీకయ్యాయి.
ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది. 23 HP పవర్, 85 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందంట. 10 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుందంట. సింగిల్ ఛార్జ్‌తో 160- 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. 72v లిథియం- అయాన్ బ్యాటరీతో రానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కనీస ధర కూడా రూ.2-3 లక్షల మధ్య ఉండొచ్చని వార్తలొస్తున్నాయి.
టాటా కార్లు కొనాలనుకుంటున్నారా? వచ్చే ఏడాది జనవరి నుంచి కష్టమే..
ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేస్తున్నారా? మారిన రూల్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి
మరో విషయం ఏంటంటే.. టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్ EV (Tata Nexon EV) కారుకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇది భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్‌గా కూడా ఘనత సాధించింది. ఇప్పటివరకు దీని సేల్స్ 35 వేల యూనిట్లు దాటింది.
చాలా కుటుంబాలు తమ పిల్లలతో స్కూటర్లపై వెళ్లడాన్ని చూసి, పిల్లలు నలిగిపోతున్నారన్న భావనతో.. నానో కార్లను విడుదల చేయాలన్న స్ఫూర్తి రతన్ టాటాలో కలిగింది. దీన్ని గతంలో ఒకసారి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు టాటా. దీనిపై దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ప్రశంసలు కురిపించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా టాటా నిర్ణయాన్ని ప్రశంసించారు.
- Read Latest Business News and Telugu News
Also Read: సేల్స్‌లో దుమ్మురేపిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. ఎగబడుతున్న జనం..!
లక్షను 40 లక్షలుగా మలచిన టాటా స్టాక్.. రూ.2 నుంచి 100కు షేరు.. మీ దగ్గరుందా?