Tuesday, October 3, 2023

IND vs BAN: రోహిత్ శర్మకు గాయం.. స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రికి

Authored by Sreenu Gangam | Samayam Telugu | Updated: 7 Dec 2022, 2:39 pm

Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ గాయంతో గ్రౌండ్‌ను వీడాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సెకండ్ వన్డేలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన రోహిత్.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడ్డాడు. ఫిజియో సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్ చివర్లో తిరిగొచ్చిన రోహిత్.. బొటనవేలికి కట్టుతో కనిపించాడు. సింపుల్ క్యాచ్ వదిలేసి, దాన్ని కప్పిపుచ్చేందుకు గాయం నాటకం ఆడుతున్నాడని రోహిత్‌పై నెటిజన్లు విమర్శిస్తున్నారు.

 

గాయంతో వెనుదిరిగిన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) గాయంతో మైదానాన్ని వీడాడు. స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలో సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన రోహిత్.. ఓ క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడ్డాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో నాలుగో బంతిని అనముల్ హక్ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి ఎడ్జ్‌ తీసుకుని సెకెండ్‌ స్లిప్‌ దిశగా వెళ్లింది. స్లిప్‌లో క్యాచ్‌ పట్టే క్రమంలో రోహిత్‌ శర్మ చేతి వేలికి గాయమైంది. నొప్పితో విలవిల్లాడిన రోహిత్‌.. వెంటనే ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అనంతరం ఫిజియో సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకున్నాడు. రోహిత్ స్థానంలో గ్రౌండ్‌లోకి రజత్‌ పాటిదార్‌ వచ్చాడు.

‘కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బొటన వేలికి గాయమైంది. స్కానింగ్‌ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. బీసీసీఐ వైద్య సిబ్బంది అతడి పరిస్థితిని అంచనా వేస్తోంది’ అని బీసీసీఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది.

ఇక ఈ అంశంపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సింపుల్ క్యాచ్‌ను నేలపాలు చేసి, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు గాయం నాటకం ఆడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ చివర్లో తిరిగొచ్చిన రోహిత్.. బొటనవేలికి కట్టుతో కనిపించాడు.

ఇదేం ఫైన్ సార్.. ఎద్దు రోడ్డు మీద మూత్రం పోయదా?: ఇల్లందు రైతు

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Latest news
Related news