Tuesday, October 3, 2023

fifa world cup, Anand Mahindra: ట్రోఫీ అతడికి ఇవ్వాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నెటిజన్ల రచ్చ రచ్చ! – man watches fifa world cup from operating table. deserves trophy says anand mahindra


Anand Mahindra: మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. ఎప్పుడూ ఇతరులకు ప్రేరణ కలిగించే, కొత్తవి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా మానవత్వానికి సంబంధించి పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు అలాగే ఓ పోస్ట్ పెట్టారు ఆనంద్ మహీంద్రా. ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌ గురించి మహీంద్రా ట్వీట్ చేశారని అనుకుంటున్నారా? అదేం లేదు? ఇక్కడ జరిగింది వేరే.. అదేంటో తెలుసుకుందాం పదండి. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఆస్పతిలో చేరగా.. అతడికి శస్త్రచికిత్స జరుగుతుంటుంది. అయినప్పటికీ అతడు ఆ సమయంలో పక్కన మ్యాచ్ చూస్తూ కనిపిస్తుంటాడు. అయితే దీనినే మహీంద్రా పోస్ట్ చేశారు.

సదరు వ్యక్తికి స్పైనల్ అనస్తీషియా సర్జరీ నిర్వహించాలని వైద్యులు చెప్పగా.. అతడు ఫిఫా వరల్డ్‌ కప్ మ్యాచ్‌ను చూడాలని అభ్యర్థించాడు. దీంతో డాక్టర్లు ఆపరేషన్ రూంలోనే ఒక టీవీని ఏర్పాటు చేయించారన్నమాట. అలా మ్యాచ్ చూసుకుంటూ ఏంచక్కా సర్జరీ చేయించుకున్నాడా ఫుట్‌బాల్ అభిమాని. పోలండ్‌లో ఈ ఘటన జరగ్గా.. అక్కడి ఆస్పత్రి వైద్యులు దీనిని ట్విట్టర్‌లో షేర్ చేశారు. సర్జన్లను ఆ బాధితుడు ఒక కోరిక కోరినట్లు డైలీ మెయిల్ నివేదించింది. తనకు సర్జరీ జరిగే సమయంలో.. వేల్స్, ఇరాన్ మధ్య జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ చూడొచ్చా అని అడిగాడట. దీనికి అంగీకరించిన వైద్యులు.. ఆ ఆపరేషన్ థియేటర్‌లోనే ఒక టీవీని ఏర్పాటు చేయించారు.

ఒక్కరోజుకే మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంతంటే?సేల్స్‌లో దుమ్మురేపిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. ఎగబడుతున్న జనం..!

ఇది ఆనంద్ మహీంద్రా కంటపడగా.. దానిని ఆయన రీట్వీట్ చేశారు. ఇక్కడే ఆయన చేసిన ఒక కామెంట్ వైరల్‌గా మారింది. ఈ వ్యక్తికి ఏదైనా ట్రోఫీ ఇవ్వాలని అనిపించలేదా అని ఫిఫాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ‘హెయ్ @FIFAcom ఈ జెంటిల్‌మెన్‌కు ఏదైనా ట్రోఫీ ఇవ్వాలని మీకు అనిపించలేదా?’ అని పోస్ట్ పెట్టారు.
Hey @FIFAcom Don’t you think this gentleman deserves some kind of trophy…??? https://t.co/ub2wBzO5QL— anand mahindra (@anandmahindra) 1670466083000మహీంద్రా చేసిన పోస్టుకు మంచి స్పందన లభించింది. వేల మంది లైక్స్ కొట్టగా, వందల మంది రీట్వీట్ చేశారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ పెట్టారు. ఇండియాలో ఇలా అయితే డాక్టర్లు.. పేషెంట్ల కడుపులో కత్తులను వదులుతారని ఒకరు కామెంట్ పెట్టగా.. ఇంకొందరు సర్జరీ అయ్యాక మ్యాచ్ చూడొచ్చు కదా అని అన్నారు. ఇంకొకరైతే.. తాను 2002 నుంచి అన్ని మ్యాచ్‌లు చూస్తున్నానని, తనకు కూడా ఏదైనా ట్రోఫీ ఇవ్వాలని అడిగారు. ఇంకొందరు ఈ పోస్ట్ కింద..తాము మహీంద్రా కార్లను బుక్ చేసుకున్నామని, ఇంకా డెలివరీ రాలేదని అభ్యర్థించారు. దీనికి మహీంద్రా కస్టమర్ కేర్ రిప్లై కూడా ఇవ్వడం విశేషం.

ఆనంద్ మహీంద్రా ఇటీవల టీ20 వరల్డ్‌కప్ సమయంలోనూ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. అప్పట్లో ఇంగ్లాండ్‌ను గెలిపించిన బెన్ స్టోక్స్.. నరాల నుంచి విక్టరీ వ్యాక్సిన్‌ను తయారు చేయాలని సీరం సంస్థను అభ్యర్థించారు. అతడికి ఓటమన్నదే తెలియట్లేదని పొగిడారు మహీంద్రా. దీనిపైనా నెటిజన్లు భిన్నంగా స్పందించారు.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: 2 వేల నుంచి రూ.7 వేలకు పెరిగిన షేరు.. 260 శాతం లాభాలు.. సొంతం చేసుకోండి!
TATA Nano: టాటా కలల కారు నానో మళ్లీ వచ్చేస్తుంది.. ఈసారి కొత్త అవతారంలో.. అబ్బురపరిచే ఫీచర్లు!



Source link

Latest news
Related news