గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే మిగిలిన గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు కొనసాగాలని జగన్ చెప్పారు. ఇందుకోసం 10 నుంచి 15 రోజుల్లో 1.66 కోట్ల కుటుంబాలను పార్టీ తరఫున కలుసుకునేందుకు కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఇందుకోసం 50 కుటంబాల వారీగా మ్యాపింగ్(Mapping) చేస్తున్నట్టుగా ప్రకటించారు జగన్. అయితే ప్రతీ 50 ఇళ్ల ఒక పురుషుడు, మహిళ గృహసారథులుగా ఉంటారని చెప్పారు. పార్టీ సందేశాన్ని చేరవేయడం, వారికి తయారుచేసిన పబ్లిసిటీ మెటరీయల్‌ను అందించడం తదితర కార్యక్రమాలు చూస్తారన్నారు.
BREAKING NEWS