Friday, March 31, 2023

వివాదంలో చిక్కుకున్న షాయాజీ షిండే.. పోలీసులకి నిర్మాత ఫిర్యాదు

టాలీవుడ్‌లో గత దశాబ్దన్నర కాలంగా చాలా సినిమాలు చేసిన షాయాజీ షిండే (Sayaji Shinde) వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై మరాఠీ నిర్మాత సచిన్ సనన్ (Director Sachin Sasane) పోలీసులకి ఫిర్యాదు చేశాడు. తన సినిమాలో యాక్ట్ చేసేందుకు రూ.5 లక్షలు తన వద్ద తీసుకుని.. చివరికి హ్యాండిచ్చినట్లు సదరు ప్రొడ్యూసర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా షిండే కారణంగా రూ.17 లక్షల్ని తాను నష్టపోయినట్లు కూడా ప్రొడ్యూసర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరాఠి సినిమా ‘గిన్నాద్’లో ఓ రోల్ కోసం షాయాజీ షిండే‌ని సంప్రదించగా.. కథ విన్న అతను సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. కానీ.. అతను ఇచ్చిన డేట్స్‌లో షూటింగ్‌కి రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన ప్రొడ్యూసర్.. కారణం అడిగితే సరైన సమాధానం చెప్పలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత రోజు షూటింగ్‌కి వచ్చి.. స్క్రిప్ట్ మార్చమని సెట్‌లో గొడవ చేసి వెళ్లిపోయినట్లు సచిన్ సనన్ చెప్పుకొచ్చాడు.

సినిమాలో యాక్ట్ చేసేందుకుషాయాజీ షిండేకి రూ.5 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చానని.. అతను వెళ్లిపోవడంతో షూటింగ్ ఆగిపోయినందుకు తాను ఓవరాల్‌గా రూ.17 లక్షలు వరకూ నష్టపోయినట్లు నిర్మాత వెల్లడించాడు. ఈ మొత్తం షాయాజీ షిండే‌ నుంచి ఇప్పించాలని పోలీస్ స్టేషన్‌తో పాటు అఖిల భారత మరాఠీ ఫిల్మ్ కార్పొరేషన్‌లోనూ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేశాడు.

వాస్తవానికి ఈ మ్యాటర్‌ని సాఫ్ట్‌గానే సెటిల్ చేసుకోవాలని ప్రొడ్యూసర్ భావించాడట. కానీ షాయాజీ షిండే‌ తన కాల్స్‌ని లిప్ట్ చేయకపోవడం.. వేరొకరి ద్వారా డబ్బులు రిటర్న్ చేయాలని అడిగిస్తే? సరైన సమాధానం చెప్పకపోవడంతో ఫిర్యాదు చేయక తప్పలేదని ప్రొడ్యూసర్ వివరించాడు. మరి షాయాజీ షిండే‌ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. తెలుగులో చాలా సినిమాల్లో భిన్నమైన పాత్రల్ని షాయాజీ షిండే‌ పోషించాడు. పోకిరీలో పోలీస్ ఆఫీసర్.. ఠాకూర్‌లో విలన్.. అల్లరి నరేష్ యముడికి మొగుడులో యముడి పాత్రలో అతను కనిపించాడు. అరుంధతి సినిమాలో అతను పోషించిన ‘అన్వర్’ పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది.

Read Latest Telugu Movies News , Telugu News, Actress Photos Gallery

Latest news
Related news