Friday, March 31, 2023

వచ్చే ఏడాది క్రికెట్ పండుగ.. వరుస షెడ్యూళ్లను విడుదల చేసిన BCCI

భారత్‌లో క్రికెట్ అభిమానులకు వచ్చే ఏడాది ఇక పండగే. బ్యాక్-టు-బ్యాక్ హోమ్ సిరీస్‌లకు బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న విదేశీ సిరీస్ ముగిసిన తర్వాత, భారత జట్టు స్వదేశీ గడ్డపై వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే సిరీస్‌లలో ఆడనుంది. తొలుత లంక జట్టుతో మూడు T20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో 3 టీ20లు, మూడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్ ఆడిన తర్వాత, భారత్ తన దృష్టిని టెస్ట్ క్రికెట్‌పై మళ్లిస్తుంది. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తుంది.

భారత్ చివరిసారిగా 2017లో బోర్డర్ – గవాస్కర్ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చింది. కీలకమైన రెడ్ బాల్ యుద్ధం ఫిబ్రవరి 9న ప్రారంభమై మార్చి 13 వరకు కొనసాగుతుంది. అనంతరం ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ విజేత (ఆస్ట్రేలియా)తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడుతుంది.

వచ్చే ఏడాది అక్టోబర్ – నవంబర్‌లో వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు జట్లతో బిజీ క్రికెట్ షెడ్యూల్ ఆటగాళ్లకు మంచి అనుభవం ఇస్తుందని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. టీమిండియా 50 ఓవర్ల ఆటలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుంది. న్యూజిలాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుండగా.. ఆస్ట్రేలియాతో రెండే వన్డే వైజాగ్ వేదికగా జరుగనుంది.

India vs Sri Lanka schedule:
తొలి T20 – జనవరి 3 (ముంబై)
రెండో T20 – జనవరి 5 (పుణే)
మూడో T20 – జనవరి 7 (రాజ్‌కోట్‌)

తొలి వన్డే – జనవరి 10 (గువాహటి)
రెండో వన్డే – జనవరి 12 (కోల్‌కతా)
మూడో వన్డే – జనవరి 15 (త్రివేండ్రం)

India vs New Zealand schedule:
తొలి వన్డే – జనవరి 18 (హైదరాబాద్)
రెండో వన్డే – జనవరి 21 (రాయ్‌పూర్)
మూడో వన్డే – జనవరి 24 (ఇండోర్)

తొలి T20 – జనవరి 27 (రాంచీ)
రెండో T20 – జనవరి 29 (లక్నో)
మూడో T20 – ఫిబ్రవరి 1 (అహ్మదాబాద్)

★ India vs Australia schedule:
తొలి టెస్టు – ఫిబ్రవరి 9-13 (నాగ్‌పూర్)
రెండో టెస్టు – ఫిబ్రవరి 17-21 (ఢిల్లీ)
మూడో టెస్టు – మార్చి 1-5 (ధర్మశాల)
నాలుగో టెస్టు – మార్చి 9-13 (అహ్మదాబాద్‌)

తొలి వన్డే – మార్చి 17 (ముంబై)
రెండో వన్డే – మార్చి 19 (విశాఖపట్నం)
మూడో వన్డే – మార్చి 22 (చెన్నై)

ప్రచార రథంతో పవన్ కళ్యాణ్.. వాహనం పేరుకు అర్థమిదే

Latest news
Related news