Tuesday, October 3, 2023

Vitamin B12 : ఈ విటమిన్ లోపం ఉంటే నరాల లోపం వస్తుందట..

విటమిన్ బి12 నాడీ వ్యవస్థను నియంత్రించడంలో సాయపడే కీలకమైన పోషకం అని చెబుతారు. అందుకే, ముఖ్య పోషకం లేకపోవడం, లోపం అనేక నాడీ సంబంధిత లక్షణాలకు దారి తీస్తుంది. యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్ విటమిన్ బి12 లోపం చాలా సందర్భాల్లో ఈజీగా ట్రీట్‌మెంట్ చేయొచ్చు. అయినప్పటికీ, నయం చేయకుండా వదిలేస్తే సమస్య అభివృద్ధి చెందుతుంది. నాడీ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. నరాల సమస్యలు అభివృద్ధి చెందితే అవి తగ్గనివి కావొచ్చు అని హెల్త్ బాడీ చెబుతోంది.

విటమిన్ బి 12 లోపం వల్ల భౌతిక సమన్వయం(అటాక్సియా) కోల్పోవడం) మీ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మాట్లాడడం, నడవడంలో ఇబ్బంది కలిగిస్తుందని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.

Also Read : Heart attack : గుండెనొప్పి వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్ దగ్గర ఉంటే మంచిదట..

మాయో క్లినిక్ నడిచే శైలిని చెబుతుంది. విటమిన్ బి12 లోపం ఉన్న వ్యక్తి అస్థిరంగా నడుస్తాడు. వారి పాదాలు వెడల్పుగా ఉంటాయి.

అదే విధంగా, జాన్స్ హాప్కిన్స్ మెడిసన్ నడకను అస్థిరమైన నడకగా సూచిస్తుంది. నడక సమన్వయం లేని కారణంగా అటాక్సిన్ నడక ఏర్పడుతుంది. అటాక్సియా, సమన్వయం లేని అస్థిరమైన నడక కాకుండా, విటమిన్ బి12 లోపం వల్ల ఇతర నరాల సమస్యలు వస్తాయి.

హార్వర్డ్ హెల్త్ ప్రకారం విటమిన్ బి12 లోపం లక్షణాలలో చేతులు, కాళ్లు, తిమ్మిర్లు, జలదరింపు, వాపు, నాలుక ఎర్రబడడం, ఆలోచించడంలో ఇబ్బంది, బలహీనత, అలసట, రక్తహీనత, అస్థిరమైన, సమతుల్య సమస్యలు ఉంటాయి. విటమిన్ బి 12 లోపం విషయానికొస్తే తక్షణ చికిత్స పొందడం వల్ల దీర్ఘకాలిక, కోలుకోలేని లక్షణాలను నివారించొచ్చు.

Also Read : Weight loss : రోజూ ఇలా తింటే త్వరగా బరువు తగ్గుతారట..

అన్నింటిలో మొదటిది, పరిస్థితిని నిర్ధారించడంలో సహాయపడే రక్తపరీక్షను తప్పనిసరిగా చేయొచుకోవాలి. మీకు సమస్య ఉందని తెలిశాక ట్రీట్‌మెంట్ కొనసాగించొచ్చు.

 • హార్వర్డ్ హెల్త్ ప్రకారం తీవ్రమైన బి 12 లోపాన్ని రెండు విధాలుగా సరిచేయొచ్చు. విటమిన్ బి 12, రోజువారీ ఎక్కువ డోస్ బి 12 ట్యాబ్లెట్స్.
 • ఓ తేలికపాటి బి 12 లోపాన్ని ప్రామాణిక మల్టీవిటమిన్‌తో సరిచేయొచ్చు.
 • విటమిన్ బి 12 లోపం లక్షణాల విషయంలో, మీ డాక్టర్ బి 12 టెస్ట్ చేయొంచుకోవాలని చెబుతారు.
 • యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్(NHS) ప్రకారం, విటమిన్ బి 12, ఫోలేట్ లోపం ఉన్న వ్యక్తులను గుర్తించడంలో సాయపడేందుకు వివిధ రకాల బ్లడ్ టెస్ట్ చేస్తారు.
విటమిన్ బి 12 లోపం


పరీక్ష ఎందుకు చేస్తారు..

 • మీరు సాధారణ స్థాయి కంటే తక్కువ స్థాయి హిమోగ్లోబిన్ కలిగి ఉన్నారా..
 • మీ ఎర్ర రక్త కణాలు సాధారణం కంటే పెద్దవిగా ఉన్నాయా
 • మీ రక్తంలో విటమిన్ బి12 స్థాయి
 • మీ రక్తంలో ఫోలేట్ స్థాయి

చాలా మంది వ్యక్తుల్లో, విటమిన్ బి 12 లోపాన్ని నివారించొచ్చు అని హర్వార్డ్ హెల్త్ చెబుతోంది.

హెల్త్ బాడీ ప్రకారం, కఠినమైన శాకాహారులు, రొట్టెలు, తృణధాన్యాలు, విటమిన్ బి12తో బలపరిచిన ఇతర ధాన్యాలు తినొచ్చు, రోజువారీ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

ఓ ప్రామాణిక మల్టీ విటమిన్ ఆరు మైక్రో గ్రాములను అందిస్తుంది. సగటు శరీరం రోజువారీ అవసరాన్ని కవర్ చేసేందుకు సరిపోతుందని హెల్త్ బాడీ చెబుతోంది.

మీకు 50 ఏళ్ళు పైబడితే, మీరు ఆ ఆహారం ద్వారా తగినం విటమిన్‌ని గ్రహించలేకపోవచ్చు. కాబట్టి, మీరు సప్లిమెంట్స్ నుండి అదనపు బి 12 పొందాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సిఫార్సు చేస్తోంది.

ఓ ప్రామాణిక మల్టీ విటమిన్ ట్రిక్ చేయాలి.

విటమిన్ బి12 శరీరంలో సహజంగా ఉత్పత్తి జరుగదు. అందుకే మనం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అందువల్ల విటమిన్ బి 12 లభించే ఫుడ్స్.

Also Read : Joint pains Diet : వీటిని తింటే చలికాలంలో వచ్చే నొప్పులు తగ్గుతాయట..

 • పాలు
 • గుడ్లు
 • పెరుగు
 • ఫ్యాటీ ఫిష్
 • రెడ్ మీట్స్
 • బలమైన తృణధాన్యాలు

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news