RRB Group D Result 2022 : ఏ క్షణమైనా రైల్వే గ్రూప్ డీ ఫలితాలు..?
RRB Group D Result 2022 : ఇప్పటికే రైల్వే గ్రూడ్ డీ (Railway Group D) పరీక్షలు దశల వారీగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్ ను కూడా విడుదల చేశారు. అయితే ఫలితాల విడుదల ఆలస్యం అవుతుండటంతో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. RRB Group D పరీక్షకు సంబంధించి ఐదు దశల ఫలితాలను మొత్తం కలిపి ఒకే సారి విడుదల చేయనున్నట్లు సమాచారం.
పరీక్షలకు హాజరైన అభ్యర్థులు రైల్వే బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ లో ఈ ఐదు దశల ఫలితాలను ఏకకాలంలో చెక్ చేసుకోవచ్చు. ఇక ఫలితాల తేదీ విషయానికి వస్తే.. ఈ పరీక్ష ఫలితం ఈ వారంలో ఎప్పుడైనా రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది:
RRB Group D ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇది ఇప్పటికే నిర్వహించబడింది. దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. చివరకు మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు RRB Group D పోస్టులకు ఎంపిక అవుతారు.