Friday, March 31, 2023

rbi hikes repo rate, RBI MPC Meet: సామాన్యులపై మళ్లీ ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లు పెంచిన RBI.. ఎవరిపై ప్రభావం? – rbi monetary policy live, rbi mpc hikes repo rate by 35 bps


RBI MPC Meet: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష (RBI Policy Meet) ముగిసింది. తన నిర్ణయాలను RBI గవర్నర్ శక్తికాంత దాస్ (SHAKTIKANTA DAS) ప్రకటించారు. ఈ సారి రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తంగా రెపో రేటు 6.25 శాతానికి రెపో రేటు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను (RBI Rates Hike) పెంచడం ఇది వరుసగా ఐదో సారి కావడం గమనార్హం. అంతకుముందు మాత్రం 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచగా ఈసారి కాస్త తక్కువే పెంచి ఉపశమనాన్ని కల్పించింది. ప్రతి నెలా ద్రవ్యోల్బణం.. ఆర్‌బీఐ లక్షిత పరిధి అయిన 6 శాతానికి మించి నమోదవుతున్న నేపథ్యంలో రెపో రేటును పెంచక తప్పట్లేదు. కొంత కాలంగా ద్రవ్యోల్బణం లెక్కకు మించి నమోదవుతోంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా భారీగా పడిపోతుంది.

మరోవైపు ఆర్థిక మాంద్యం (Recession Fears) సంకేతాలు భయపెడుతున్నాయి. రానున్న 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. దీంతో ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పటినుంచే వడ్డీ రేట్లను పెంచుతున్నాయి ప్రపంచ దేశాలు. యూఎస్ ఫెడ్ (US Fed Rates Hike) తొలుత పెంచదా.. అదే బాటలో ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు పయనించాయి.

ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో.. ఈ భారాన్ని వెంటనే అన్ని బ్యాంకులు ప్రజలపై మోపుతాయి. రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇవి గృహ, పర్సనల్, ఎడ్యుకేషన్, వాహన ఇలా అన్నింటిపై వర్తిస్తాయి. అయితే.. అదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇప్పటికే బ్యాంకులు ఆ విధంగా వడ్డీ రేట్లను పెంచే పనిలో ఉన్నాయి.

Also Read: లక్షల్లో ఉద్యోగులు.. భారత్‌లో టాప్-10 కంపెనీలివే.. అంబానీకి చోటు.. అయ్యో అదానీ!

ఇప్పటికే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా పెంచుకుంటూ పోయింది. అక్కడ ఏకంగా 75 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లు పెంచుతోంది ఫెడరల్ రిజర్వ్. డిసెంబర్ 13-14 తేదీల్లో యూఎస్ ఫెడ్ సమావేశం కానుంది. అప్పుడు మరోసారి వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం ప్రకటించనున్నారు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్. ఈసారి మాత్రం 50 బేసిస్ పాయింట్ల మేర పెంచొచ్చని తెలిసింది.

Also Read: వేల కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ.. మంచి డిమాండ్ ఉన్నా.. ఇప్పుడేం సమస్య వచ్చింది?

ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 62 వేల 735 వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 18 వేల 660 వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి GDP వృద్ధి రేటు అంచనాలను కూడా తగ్గించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గతంలో 7 శాతంగా ఉంటుందని అంచనా వేయగా.. ఇప్పుడు దానిని 6.8 శాతానికి తగ్గించింది. రెపో రేటు అంటే.. బ్యాంకులకు ఇచ్చే నిధులపై RBI తీసుకునే వడ్డీ. అంటే ఇది బ్యాంకులకు భారంగా మారుతుంది. అందుకే నేరుగా బ్యాంకులు.. దీనిని ప్రజలపైకి మళ్లిస్తుంది. వారు తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లను పెంచి సొమ్ము చేసుకుంటాయి.

లక్షాధికారుల్ని చేసిన ఐటీ స్టాక్ ఇదే.. 3 సార్లు బోనస్.. రూ.50 నుంచి 400కు షేరు..
లక్షను 40 లక్షలుగా మలచిన టాటా స్టాక్.. రూ.2 నుంచి 100కు షేరు.. మీ దగ్గరుందా?

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: వారికి ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..వేల కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ.. మంచి డిమాండ్ ఉన్నా.. ఇప్పుడేం సమస్య వచ్చింది?



Source link

Latest news
Related news