ఒక నెల MCLR 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.25 శాతం నుంచి 8.30 శాతానికి చేరింది. 3 నెలల MCLR రేటు 8.35 శాతానికి, 6 నెలల MCLR రేటు 8.45 శాతానికి పెరిగింది. ఎన్నో కన్జూమర్ లోన్లకు నేరుగా అనుసంధానమైన 1 ఇయర్ MCLR ఇప్పుడు 8.60 శాతానికి చేరినట్లయింది. ఇక 2- ఇయర్ MCLR 8.30 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. 3- ఇయర్ MCLR 8.75 శాతం నుంచి 8.80 శాతానికి చేరింది.
ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్లు ఇవే.. హోండా నుంచి టీవీఎస్ వరకు..
ఇవాళ ఉదయం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరంలో ఇప్పటికే వరుసగా ఐదు సార్లు రెపో రేటును పెంచినట్లయింది. ఈ సారి 35 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచగా.. మొత్తం రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. ఏప్రిల్‌లో ఇది 4 శాతం వద్ద ఉండటం గమనార్హం. మే నుంచి 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచగా.. ఈసారి మాత్రం కాస్త తగ్గించింది.
సామాన్యులపై మళ్లీ ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లు పెంచిన RBI.. ఎవరిపై ప్రభావం?ఇప్పుడు RBI రెపో రేటుకు అనుగుణంగా.. బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి. RBI తమపై మోపిన భారాన్ని.. వెంటనే ఇతర రుణాలపై వడ్డీ రేట్లను పెంచి నేరుగా ప్రజలపైకి మళ్లిస్తాయి బ్యాంకులు. దీంతో త్వరలోనే ఇతర బ్యాంకులు వాహన, పర్సనల్, బిజినెస్, గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.
ఒక్కరోజే 20 శాతం పెరిగిన రూపాయి షేర్లు.. డబ్బులు పెట్టినవారికి భారీ లాభం..
వారికి ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..
బ్యాంకులు తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను.. MCLR ను పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తుంటుంది. ఇప్పుడు లెండింగ్ రేట్లను పెంచిన HDFC బ్యాంక్.. త్వరలో ఇతర వడ్డీ రేట్లను కూడా సవరించనుంది. ఇదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇది మాత్రం బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసిన వారికి మేలు చేస్తుంది. వారికి అధిక వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లకు మరింత ఎక్కువ వడ్డీ అందుతుంది.
- Read Latest Business News and Telugu News
Also Read: హోం లోన్లపై పెరిగిన EMI.. వామ్మో 23 శాతం ఎక్కువ కట్టాలా? సామాన్యులపై పెను భారం..