ఈ సభ తర్వాత జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని వైసీపీ నేతలు వెల్లడించారు. ఈ సభ కోసం వార్డు మెంబర్లు, పంచాయతీ సర్పంచ్‌లు, పీఏసీఎస్ అధ్యక్షులు, సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్న 82,432 మంది బీసీలకు ఆహ్వాన పత్రాలను అందించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఇక సభకు వచ్చే వారికోసం 24 రకాల వంటకాలను సిద్ధం చేయనున్నారు. సభను విజయవంతం చేసేందుకు భారీగా జనాన్ని తరలించనున్నారు వైకాపా శ్రేణులు.
BREAKING NEWS