Tuesday, March 21, 2023

How to lighten dark elbows: మోచేతుల నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..! – simple and effective tips to lighten dark elbows and knees

How to lighten dark elbows: ఆడవాళ్లు అందానికి చాలా ఇంపార్టెన్స్‌ ఇస్తూ ఉంటారు. ముఖంపై చిన్నమచ్చ వచ్చినా అది తగ్గేవరకు.. ఏవేవో క్రీమ్‌లు అప్లై చేస్తుంటారు. అందమైన చేతులకు, కాళ్ల కోసం.. మానిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయించుకుంటూ ఉంటారు. కానీ, కొంతమంది మోచేతులు, మోకాళ్లు, కాలిమడమలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీని వల్ల అవి నల్లగా, గరుకుగా మారతాయి. ఆలస్యంగా.. ఈ సమస్యను గుర్తించి ఏవేవో క్రీమ్‌లు రాస్తూ ఉంటారు. మన ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతోనే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

నిమ్మరసం..

నిమ్మరసం క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది మన శరీరంపై పేరుకున్న మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. నిమ్మచెక్కను తీసుకొని మోచేతులపై నలుపుగా ఉన్నచోట కాసేపు రుద్దండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. నిమ్మచెక్కను ఉప్పులో ముంచి రుద్దినా మోచేతులపై ఉన్న నలుపు తగ్గుమఖం పడుతుంది.

పెరుగు..

పెరుగు మోచేతుల నల్లధనాన్ని పోగొడుతుంది. దీనిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం రంగును కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే.. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో రెండు స్పూన్ల పెరుగు, కొద్దిగా వైట్‌ వెనిగర్‌ తీసుకొని మిక్స్‌ చేయండి. దీన్ని మోచేతులకు, మోకాళ్లకు రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. టవల్‌తో పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు విరుగుతుంది.

శనగపిండి..

శనగపిండి.. మోచేతులు, మోకాళ్ల నలుపు పొగొడుతుంది. ముందుగా మోచేతులను శుభ్రం చేసుకోండి. శనగపిండి తీసుకుని దానిలో పెరుగు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను మోచేతులు, మోకాళ్లు, కాలిమడమలకు అప్పై చేయండి. ఇది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇలా రోజూ చేస్తే.. నలుపు పోతుంది.

కలబంద..

కలబంద గుజ్జును నల్లగా ఉన్న మోచేతులకు, మోకాళ్లకు రాసుకోవాలి. ఆ తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. రోజుకి రెండు సార్లు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే నలుపు విరుగుతుంది.

చక్కెర..

మోచేతులు, మోకాళ్ల నలుపు తొలగించడానికి చక్కెర ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మీరు ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ తీసుకుని కొద్దిగా చక్కెర వేసి మిక్స్‌ చేయిండి. దీని ఎఫెక్టెడ్‌ ప్రాంతాల్లో అప్లై చేయండి. ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు స్క్రబ్‌ చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. పంచదార మృతకణాలను తొలగిస్తుంది. ఆలివ్‌ నూనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రోజూ ఇలా చేస్తే నలుపు పోతుంది.

బియ్యం పిండి..

బియ్యంపిండిలో కొద్దిగా రోజ్‌వాట‌ర్ మిక్స్ చేసి, మోచేతుల‌కు అప్లై చేయండి. ప‌ది నిమిషాల పాటు ఆర‌నివ్వండి. ఆ తర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే.. మంచి రిజల్ట్స్‌ ఉంటాయి.

కొబ్బరి నూనె..

కొబ్బరి నూనె మోకాలు, మోచేతుల నలుపు తొలగించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్‌ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కొబ్బరి నూనెను వారానికి 2 నుండి 3 రోజులు రాస్తే ఈ సమస్య దూరం అవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news