Friday, March 31, 2023

gold atm hyderabad, Gold ATM: 12 సంవత్సరాల కిందటే అక్కడ గోల్డ్ ఏటీఎం.. ఇన్నేళ్లకు హైదరాబాద్‌లో.. విత్‌డ్రా ఎలా అంటే? – gold atm has now started in india, running in dubai since 12 years see full details here


Gold ATM: గోల్డ్‌ను కొనుగోలు చేసేందుకు ఇక జువెలరీ షాప్స్‌కు, దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏటీఎంల నుంచే బంగారాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కలిగింది. ఏటీఎంల్లో డబ్బులు తీసుకున్నంత సులభంగా ఇకపై గోల్డ్‌ను కూడా తీసుకోచ్చన్నమాట. ఇటీవలే హైదరాబాద్ బేగంపేటలో దేశంలోనే మొట్టమొదటి గోల్డ్ ఏటీఎంను ఏర్పాటు చేసింది గోల్డ్ సిక్కా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. హైదరాబాద్‌కే చెందిన ఓపెన్‌క్యూబ్ టెక్నాలజీస్.. ఈ రియల్ టైమ్ గోల్డ్ ఏటీఎంను అందుబాటులోకి తీసుకొచ్చింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు నాణేలను (Gold Coins) డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి.. ఏటీఎంల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు రేంజ్ ఉన్న గోల్డ్ కాయిన్లను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుందని గోల్డ్‌సిక్కా సీఈఓ సి. తరుజ్ చెప్పారు. ఏటీఎం స్క్రీన్‌పై కాయిన్ ప్రైస్ లైవ్‌లో చూడొచ్చని అన్నారు. త్వరలో పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌ల్లో కూడా గోల్డ్ ఏటీఎంలను తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3000 గోల్డ్ ఏటీఎంలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు. 24X7 ఇది అందుబాటులో ఉంటుందని వివరించారు.

వడ్డీ రేట్ల పెంపు.. వెంటనే భారీగా పెరిగిన బ్యాంకింగ్ స్టాక్.. ట్రెండింగ్‌లో ఇదే..

అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే? భారత్‌లో మొట్టమొదటిసారిగా గోల్డ్ ఏటీఎం ఇప్పుడు అందుబాటులోకి రాగా.. దుబాయ్‌లో మాత్రం 12 ఏళ్ల కిందటి నుంచే వాడుకలో ఉంది. అంటే 2010లో అక్కడ తొలుత దీనిని తీసుకొచ్చారు. ప్రపంచంలో కూడా మొట్టమొదటి గోల్డ్ ఏటీఎం ఇదే. ఇంకా దుబాయ్‌లో చాలానే గోల్డ్ ఏటీఎంలు ఉన్నాయి.

వారికి బ్యాడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. కొత్త రేట్లు ఇవే..
ఒక్కరోజే 20 శాతం పెరిగిన రూపాయి షేర్లు.. డబ్బులు పెట్టినవారికి భారీ లాభం..

2010లో.. అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్ లాబీలో మొట్టమొదటి గోల్డ్ ఏటీఎంను లాంఛ్ చేశారు. ఆ తర్వాత దుబాయ్‌లో ఎన్నో ప్రాంతాల్లో వీటిని విస్తరించారు. అక్కడ గోల్డ్ బార్స్, గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ కాయిన్లను విత్‌డ్రా చేసుకోవచ్చు. దుబాయ్ తర్వాత అలాంటి ఏటీఎంలను జర్మనీ, అమెరికాలో కూడా ఎన్నో ఏళ్ల కిందటే తీసుకొచ్చారు.

గోల్డ్‌ను ఎలా విత్‌డ్రా చేసుకోవాలి..?

ఇతర సాధారణ ఏటీఎంల వలె పనిచేస్తుంది గోల్డ్ ఏటీఎం.
అయితే తొలుత ఏటీఎంపై ‘Click here to buy Gold’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయాలి.
తర్వాత ఎంత మేర బంగారాన్ని కొనుగోలు చేయాలో ఎంచుకోవాల్సి ఉంటుంది.
0.5, 1, 2, 5, 10, 50, 100 గ్రాములు ఇలా వివిధ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
ఎంత గోల్డ్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు పేమెంట్ ఎలా చేస్తారో ఆప్షన్ కనిపిస్తుంది.
డెబిట్, క్రెడిట్ కార్డుల్లో దేనిని ఉపయోగిస్తారో సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్ట్స్ కార్డు ప్లేస్ చేసి PIN నంబర్ ఎంటర్ చేయాలి. స్టార్ట్ ట్రాన్సాక్షన్‌పై క్లిక్ చేయాలి.
మీరు చేసిన పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత.. క్యాష్ వచ్చినట్లే గోల్డ్ వస్తుంది. దానికి సంబంధించి క్వాలిటీ, వెయిట్ తెలిపే సర్టిఫికెట్ కూడా మీరు పొందుతారు.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: హోం లోన్లపై పెరిగిన EMI.. వామ్మో 23 శాతం ఎక్కువ కట్టాలా? సామాన్యులపై పెను భారం..ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్లు ఇవే.. హోండా నుంచి టీవీఎస్ వరకు..



Source link

Latest news
Related news