యంగ్ హీరో విజయ్ దేవరకొండ, బీటౌన్ బ్యూటీ అనన్య పాండే జంటగా పూరీ రూపొందించిన ‘లైగర్’ మూవీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజైన మూవీ జగన్‌కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు పూరీపై ఒత్తిడి తెచ్చే వరకు వెళ్లింది మ్యాటర్. ఈ నేపథ్యంలోనే పూరీ.. కెరీర్‌లో మళ్లీ కోలుకోవడం కష్టమనే మాటలు వినిపించాయి. అయితే, ఇలాంటి అప్ అండ్ డౌన్స్ పూరీకి అలవాటే. ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుందని తెలుసు. అందుకే తన స్కిల్‌నే నమ్ముకున్న పూరీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో పూరీ చెప్పిన స్టోరీ లైన్‌కు చిరు ఇంప్రెస్ అయ్యాడని.. పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇక చిరు, పూరీకి మధ్య ఎప్పటి నుంచో మంచి బాండింగ్ ఉంది. ‘చిరుత’ మూవీతో రాంచరణ్‌ను లాంచ్ చేసింది కూడా జగనే. అంతేకాదు చిరంజీవి రీసెంట్ మూవీ ‘గాడ్ ఫాదర్’లోనూ జగన్ చిన్న క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమి ప్రమోషన్స్‌లో జగన్.. మెగాస్టార్‌ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఫ్లాప్స్‌లో ఉన్న డైరెక్టర్‌తో సినినమా చేసేందుకు స్టార్ హీరోలు ఇష్టపడరు. కానీ చిరంజీవి మాత్రం పూరీపై ఉన్న నమ్మకంతో ఓకే చేశాడని.. స్టోరీ విషయంలో ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చాడని టాక్.
మొత్తానికి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాంబినేషన్ త్వరలోనే సాకారం కాబోతోంది. ఈ సినిమాను పూరి అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నాడని.. హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉండనుందని న్యూస్ చక్కర్లు కొడుతోంది.
- Read Latest Telugu Movies News , Telugu News