Teacher rapes minor girl: రెండేళ్లుగా అఘాయిత్యం
సౌరభ్ గుప్తా ఘజియాబాద్ లోని ఒక పాఠశాలలో కంప్యూటర్ టీచర్ గా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో చదివే విద్యార్థినిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. మొదట, కంప్యూటర్ నేర్పిస్తానని, మంచి మార్కులు వచ్చేలా చూస్తానని చెప్పి ఆ బాలికను లోబర్చుకున్నాడు. ఆ తరువాత, గ్రేడ్స్ తక్కువ వచ్చేలా చూస్తానని, ఫెయిల్ చేస్తానని బెదిరించి, లైంగిక దాడి చేయడం ప్రారంభించాడు. గత రెండేళ్లుగా ఆ బాలికను బెదిరిస్తూ, అత్యాచారం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులకు గానీ, మరెవరికైనా కానీ చెపితే, ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడు.