Friday, March 24, 2023

బంగ్లా అద్భుతం.. 100 లోపే ఆలౌట్ అయ్యే ప్రమాదం నుంచి 271 రన్స్

Authored by Sreenu Gangam | Samayam Telugu | Updated: 7 Dec 2022, 4:20 pm

India Vs Bangladesh: బంగ్లాదేశ్ ఆటగాళ్లు మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. వంద లోపే చాప చుట్టేస్తారని మ్యాచ్ చూడటం మానేసిన టీమిండియా అభిమానులు ఇన్నింగ్స్ చివర్లో టీవీ ఆన్ చేసి షాకయ్యే పరిస్థితి. 19 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాదేశ్.. 50 ఓవర్లు ముగిసే సరికి మరొక వికెట్ మాత్రమే కోల్పోయి 271 పరుగులు చేసింది. అందుక్కారణం బంగ్లా బ్యాటర్ మెహిదీ హసన్ మిరాజ్. అద్భుత సెంచరీ చేసి గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

 

బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ఆటగాళ్లు మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. ఆదిలో ఆట చూసి వంద లోపే చాప చుట్టేస్తారని మ్యాచ్ చూడటం మానేసిన అభిమానులు ఇన్నింగ్స్ చివర్లో టీవీ ఆన్ చేసి షాకయ్యే పరిస్థితి. 19 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లా.. 50 ఓవర్లు ముగిసే సరికి మరొక వికెట్ మాత్రమే కోల్పోయి 271 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్ మెహిదీ హసన్ మిరాజ్ మరోసారి రాణించాడు. కేవలం 83 బంతుల్లో సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మహ్మదుల్లా కూడా అతడికి చక్కని సహకారం అందించాడు. 96 బంతుల్లో 77 (7 ఫోర్లు) చేశాడు.

ఏడో వికెట్‌కు ఏకంగా 148 పరుగులు జోడించారు. భారత్‌పై బంగ్లాదేశ్‌‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఏ వికెట్‌కు అయినా. భారత పేసర్లు ఆదిలో కట్టుదిట్టమైన బంతులతో బంగ్లా బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. అయితే, ఎప్పట్లాగే కీలక సమయంలో చేతులెత్తేశారు. ఫలితంగా 100 పరుగులే కష్టమని భావించిన మ్యాచ్‌లో.. బంగ్లాదేశ్‌ ఏకంగా 271 పరుగులు చేసింది.

Don’t Miss:ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్న ట్విన్స్.. పోలీసుల ట్విస్ట్!

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Latest news
Related news