Friday, March 31, 2023

uidai, Aadhaar Card: ఆధార్ కార్డు ఇలా వాడుతున్నారా? UIDAI కీలక సూచనలు.. జాగ్రత్తగా లేకుంటే.. – uidais directions for all aadhaar card holders, follow them to avoid getting into trouble


Aadhaar Card: ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా వినియోగించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ- యూఐడీఏఐ (UIDAI) చెబుతోంది. ఈ మేరకు ఆధార్ కార్డు హోల్డర్లకు కీలక సూచనలు జారీ చేసింది. తద్వారా ఎలాంటి చిక్కులు ఉండవని స్పష్టం చేసింది. లేదంటే ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, ఇంకా కొన్ని క్లిష్టంగా మారతాయని చెప్పింది. ఆధార్ కార్డు భారత పౌరులకు ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. బ్యాంకు లావాదేవీలు, ఇతర గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు కచ్చితంగా అవసరం పడుతుంది. అందుకే ఆధార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని UIDAI వివరించింది.

ఎక్కువగా జనం ఆధార్ కార్డు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని గుర్తించింది యూఐడీఏఐ. ఎక్కువగా కార్డులను ట్విస్ట్ చేస్తున్నారని, పలు విధాలుగా ట్యాంపరింగ్ చేస్తున్నారని పేర్కొంది. అందుకే అలాంటి వారి కోసం పలు సూచనలు చేసింది. ఆధార్‌ను ఎక్కడైనా ఉపయోగించే ముందు కచ్చితంగా దాని అథెంటిసిటీని చెక్ చేసుకోవడం కీలకమని వెల్లడించింది.

ఆధార్ కార్డు వాస్తవికతను తనిఖీ చేయడానికి.. QR కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫిజికల్ డ్యామేజీ వస్తే.. అప్పుడు QR కోడ్‌ను స్కాన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీ ఆధార్ కార్డు పనిచేయకపోయే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని UIDAI చెప్పింది. ఇది భవిష్యత్తులో ఎన్నో సమస్యలు సృష్టిస్తుందని చెప్పిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ.. ఆధార్ కార్డును పాడవకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ట్విస్ట్ అవ్వకుండా చూసుకోవాలని వివరించింది.

ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్లు ఇవే.. హోండా నుంచి టీవీఎస్ వరకు..
లక్షను 40 లక్షలుగా మలచిన టాటా స్టాక్.. రూ.2 నుంచి 100కు షేరు.. మీ దగ్గరుందా?

ఆధార్ కార్డును ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలంటే?

ఆధార్ కార్డును లామినేషన్ చేయించి.. జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.
ఆధార్ కార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోల్డ్ చేయకూడదు.
ఆధార్ కార్డు డ్యామేజీ కాకుండా ఉండేందుకు.. దానిని చిన్న పిల్లలకు దగ్గర్లో ఉంచకూడదు.
అలాంటి ఆధార్ కార్డులో అన్ని వివరాలు సరిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అందులో ఫోన్ నంబరు, చిరునామా, పేరు అన్నీ సరిగ్గా ఉండాలి. వీటిని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో సరి చేసుకోవచ్చు.

ఇంకా ఆధార్ కార్డుకు సంబంధించి ఏ విధమైన పరిష్కారం కోసమైనా 1947 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు. వారు అన్ని వివరాలు మీకు అందిస్తారు. ఈ నంబర్‌కు కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు. సోమవారం నుంచి శనివారం వరకు.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాల్ సెంటర్ ప్రతినిధులు అందుబాటులోనే ఉంటారు. ఇక ఆదివారం రోజు రిప్రజెంటేటివ్స్.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: రికార్డులన్నీ తుడిచేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ఎగబడుతున్న జనం.. కళ్లుచెదిరే ఫీచర్లు..!



Source link

Latest news
Related news