Tuesday, March 21, 2023

tata motors hikes prices, Tata Motors: టాటా మోటార్స్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి.. – tata motors hikes prices, you may have to pay more for punch, nexon, and other tata cars from january 2023


Tata Motors: కొత్త సంవత్సరం వేళ కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ ప్యాకెట్ల నుంచి కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త. 2023లో వివిధ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి మరి. ఇప్పటికే సేల్స్‌ను వీలైనంత ఎక్కువ జరిపి ముగించుకోవాలని చూస్తున్న కంపెనీలు.. మంచి డిమాండ్ ఉన్న వాహనాల ధరల్ని ఇప్పటికే పెంచాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం జనవరి నుంచి పెంచిన రేట్లను అమలు చేయనున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు మరో దిగ్గజ కార్ మేకర్ టాటా మోటార్స్ కూడా అదే బాటలో పయనించనుంది. వచ్చే నెల నుంచి అంటే 2023 జనవరి నుంచి ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచాలని చూస్తోంది.

2023, ఏప్రిల్ 1 నుంచి సరికొత్త ఉద్గార నిబంధనలు (Emission Norms) అమల్లోకి రానున్న నేపథ్యంలో.. కార్ల ధరల్ని పెంచాలని చూస్తున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది. అంటే దీనికి అనుగుణంగా కార్ల తయారీకి ఖర్చులు పెరుగుతాయని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే జరిగితే టాటా కార్లు కూడా మరింత ప్రియం కానున్నాయి.

కమొడిటీస్ ధరలు పెరగడం వల్ల తమపై అధిక భారం పడుతోందని, అందుకే రేట్లు పెంచాల్సి వస్తోందని చెప్పారు టాటా మోటార్స్ (ప్యాసింజర్ వెహికిల్స్- ఎలక్ట్రిక్ వెహికిల్స్) మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర. ప్రస్తుతం కమొడిటీస్ ధరలు ఏడాది గరిష్టానికి చేరినట్లు వెల్లడించారు. రెగ్యులేటరీ ఛేంజెస్ కూడా కార్ల ధరల పెంపునకు దారి తీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్లు ఇవే.. హోండా నుంచి టీవీఎస్ వరకు..లక్షను 40 లక్షలుగా మలచిన టాటా స్టాక్.. రూ.2 నుంచి 100కు షేరు.. మీ దగ్గరుందా?

శైలేష్ చంద్ర చెప్పిన దాని ప్రకారం.. బ్యాటరీల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం ఇది ఇంకా మార్కెట్ ధరలపై ప్రభావం చూపలేదని అన్నారు. ఈ ధరలన్నీ పెరుగుకుంటూ పోతే.. తమకు ఇబ్బందిగా పరిణమిస్తుందని, అందుకే ధరల పెంపును పరిశీలిస్తున్నట్లు శైలేష్ వివరించారు. టాటా పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి మోడళ్ల ధరలు పెరగొచ్చేమో అని అన్నారు.

మరోవైపు కొత్త ఏడాదికి ముందు తమ సేల్స్‌ను పెంచుకోవాలని చూస్తున్న కార్ మేకర్స్.. ఇప్పటికే రేట్లను పెంచేశాయి. ఈ జాబితాలో రెనాల్ట్, మారుతీ సుజుకీ చేరాయి. అయితే డిమాండ్ ఉన్న కార్లను కొనుగోలు చేయాలని భావించిన కస్టమర్లు ఎలాగూ కొంటారని భావించిన కంపెనీలు.. ఎంపిక చేసిన మోడళ్లపై ధరల పెంపును అమలు చేశాయి. మరోవైపు.. ఇతర మోడళ్లపై మంచి డిసెంబర్‌లో మంచి డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాయి. ఇటీవల మంచి మంచి ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విడుదల చేస్తున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉంది.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: రికార్డులన్నీ తుడిచేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ఎగబడుతున్న జనం.. కళ్లుచెదిరే ఫీచర్లు..!



Source link

Latest news
Related news