ఏడాదిన్నర క్రితం రిషి భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన సమయంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ధనలక్ష్మీతో రిషికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెతో గడిపిన తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో గొంతు నులిమి హత్య చేశాడు. శవాన్ని మాయం చేయడం కుదరక డ్రమ్ములో దాచి పెట్టి శ్రీకాకుళం పారిపోయాడు. వీలు చూసుకుని బాడీని మాయం చేయాలని భావించినా వీలు కుదరక వదిలేశాడు. ఏడాదిన్నర తర్వాత శవం బయట పడటంతో కటకటాల పాలయ్యాడు. మృతురాలికి తల్లిదండ్రులు లేకపోవడంతో విశాఖపట్నంలో ఉంటున్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె అచూకీ పట్టించుకోక పోవడంతో ఇన్నాళ్లు అచూకీ లేకపోయినా ఎవరికి తెలియలేదు.
BREAKING NEWS