Thursday, March 30, 2023

canara bank, Cash Withdrawal: ఈ బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా చేస్తున్నారా? మారిన రూల్స్ ఇవే.. – canara bank hikes cash withdrawal daily card transaction limit for debit cards


Cash Withdrawal: ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ATM క్యాష్ విత్‌డ్రాల్, పాయింట్ ఆఫ్ సేల్స్ (POS), ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్‌లో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తక్షణమే ఇవి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఏటీఎంల నుంచి క్యాష్ విత్‌డ్రాల్ లిమిట్‌ను పెంచుతున్నట్లు తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో పేర్కొంది కెనరా బ్యాంక్. దీంతో కెనరా బ్యాంకులో ఖాతా ఉన్న వారు తమ డెబిట్ కార్డుతో.. ఇంతకుముందు ఉన్న దాని కంటే ఎక్కువ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు రోజువారీగా నిర్వహించే ఏటీఎం లావాదేవీల్లో మార్పులు చేసింది. తన వెబ్‌సైట్లో వెల్లడించడంతో పాటు.. తమ కస్టమర్లకు ఈ- మెయిల్, SMS రూపంలో ఈ సమాచారాన్ని చేరవేసింది. ఇవి కార్డుల్లో రకాలను బట్టి వేర్వేరుగా ఉంటాయని స్పష్టం చేసింది.

క్లాసిక్ డెబిట్ కార్డుకు సంబంధించి రోజువారీగా క్యాష్ విత్‌డ్రా పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.40 వేల నుంచి రూ.75 వేలకు పెంచింది. రోజుకు గరిష్టంగా ఈ డెబిట్ కార్డుతో రూ.75 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చన్నమాట.

పాయింట్ ఆఫ్ సేల్స్ (POS), ఈ కామర్స్ పరిమితిని రోజుకు రూ. లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు నిర్ణయాన్ని ప్రకటించింది.

NFC (కాంటాక్ట్‌లెస్) ట్రాన్సాక్షన్లకు సంబంధించి.. రూ.25 వేల పరిమితిని అలాగే ఉంచింది.

ప్లాటినం లేదా బిజినెస్ కార్డు హోల్డర్లకు లావాదేవీల పరిమితిని రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది కెనరా బ్యాంకు. POS/ ఈ కామర్స్‌కు సంబంధించి డైలీ లిమిట్‌ను రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది.

రికార్డులన్నీ తుడిచేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ఎగబడుతున్న జనం.. కళ్లుచెదిరే ఫీచర్లు..!
ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్లు ఇవే.. హోండా నుంచి టీవీఎస్ వరకు..లక్షను 40 లక్షలుగా మలచిన టాటా స్టాక్.. రూ.2 నుంచి 100కు షేరు.. మీ దగ్గరుందా?

Punjab National Bank
మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా డెబిట్ కార్డు లావాదేవీలకు సంబంధించి డైలీ లిమిట్‌లో మార్పులు చేసింది. PNB వెబ్‌సైట్ ప్రకారం.. ప్లాటినం మాస్టర్ కార్డు, Rupay, Visa Gold డెబిట్ కార్డులతో పాటు Rupay Select, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డుల డైలీ లిమిట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది.

HDFC Credit Card:
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు కూడా షాక్ తగిలింది. ఇతర థర్డ్ పార్టీ పద్ధతుల ద్వారా.. చెల్లింపులు చేస్తే వారి లావాదేవీలపై 1 శాతం చొప్పున ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: RBI కీలక భేటీ.. బంగారం, వెండి కొనాలంటే ఇక కష్టమేనా? 5 రోజుల్లో రూ.4500 జంప్..!



Source link

Latest news
Related news