Tuesday, March 21, 2023

Akshay Kumar: ఛత్రపతి శివాజీ పాత్రలో అక్షయ్.. వద్దంటూ నెటిజన్ల ట్రోలింగ్

ఏడాదికి ఐదారు సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తుంటాడు అక్షయ్ కుమార్. ఈ క్రమంలోనే 2022లో ఆయన నటించిన ‘బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వి రాజ్, రక్షా బంధన్, కట్ పుట్లీ, రామ్ సేతు’చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయన్న సంగతి పక్కనబెడితే.. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకోవడంతో అక్షయ్ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ, మరాఠీ పీరియడ్ డ్రామా ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ కోసం ప్రముఖ ఫిలిం మేకర్ మహేష్ మంజ్రేకర్‌తో కలిసి పనిచేస్తున్నాడు.

వసీం ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించనున్నారు అక్షయ్. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేస్తూ మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. దీంతో ఈ యాక్షన్-పీరియడ్ డ్రామాపై హైప్ క్రియేట్ అయినప్పటికీ.. తన గత చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ పరాజయంపై నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు అక్షయ్‌ను దారుణంగా ట్రోల్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ మరాఠీ పీరియడ్ డ్రామా పోస్టర్‌ షేర్ చేసిన అక్షయ్.. ‘ఈ రోజు మరాఠీ చిత్రం ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ చిత్రీకరణను ప్రారంభిస్తున్నాను, ఇందులో నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ జీ పాత్ర పోషించడం నా అదృష్టం. ఆయన జీవితం నుంచి ప్రేరణ పొంది నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఆశీర్వదించండి’ అని పోస్టు చేశాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే, నెటిజన్లు తనను ట్రోల్ చేయడం ప్రారంభించారు. మరొక చారిత్రక పాత్రను పాడు చేస్తారా ఏంటి? అని కామెంట్ చేస్తున్నారు. పృథ్వీ రాజ్ చౌహాన్ పాత్ర మాదిరే ఇది కూడా చేయొద్దు అంటూ స్పందిస్తున్నారు.

నిజానికి ఈ ఏడాది జూన్ 3న విడుదలైన అక్షయ్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ మూవీ.. రాజపుత్ర చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం, కాలాల ఆధారంగా 18 ఏళ్ల పరిశోధన తర్వాత రూపొందించబడింది.

ఇక మహేష్ మంజ్రేకర్‌తో అక్షయ్ అప్‌కమింగ్ మూవీ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ విషయానికొస్తే.. ఇందులో జే దుధానే, ఉత్కర్ష షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య, అక్షయ్, నవాబ్ ఖాన్, ప్రవీణ్ టార్డే కూడా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2023 దీపావళి కానుకగా మరాఠీ, హిందీ, తమిళం & తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Latest news
Related news