Thursday, March 30, 2023

జాయింట్ పెయిన్స్‌ని తగ్గించే ఫుడ్స్

ఆర్థరైటిస్‌కి డైట్ క్యూర్ లేనప్పటికీ, కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. మీ కీళ్ళలో వాపు తగ్గుతుంది. ఈ సూపర్‌ఫుడ్స్ తీసుకోండి. వీటి వల్ల చాలా వరకూ నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

​ఫ్యాటీ ఫిష్..

సాల్మన్, మాకేరెల్ వంటి ఫ్యాటీ ఫిష్ రకాలు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డిలో పుష్కలంగా ఉన్నాయి. ఇది కీళ్ళలో మీ నొప్పిని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను అందిస్తుంది. ఒమేగా 3 యాసిడ్ సప్లిమెంట్స్ మీ కీళ్ళ నొప్పుల తీవ్రత, ఉదయం స్టిఫ్, బాధాకరమైన కీళ్ళ సంఖ్యను తగ్గించడంలో సాయపడతాయని అనేక అధ్యయనాలు చూపించాయి.

​వెల్లుల్లి..

వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఇతర రూట్ వెజిటేబుల్స్ డయల్ డైసల్ఫైడ్ కలిగి ఉంటాయి. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనం. ఇది వాపుతో పోరాడేందుకు, నొప్పి నుండి ఉపశమనం, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది.

Also Read : Romance Regret : శృంగారం సమయంలో అలా జరిగింది.. తట్టుకోలేకపోయా..

​అల్లం..

తాజా అల్లం, ఎండిన రూపంలో రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందొచ్చు. మీరు అందులో మీ రోజువారి టీ, గ్రేవీలను అలాగే తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఓ కప్పు వెచ్చని నీటిలో కలపొచ్చు. అల్లం శరీరంలో వాపుని ప్రోత్సహించే పదార్థాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది.

​నట్స్..

గింజలు, విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్స్, బాదం, అవిసెలు, చియా, పైన్ సీడ్స్ వింటి గింజలు, విత్తనాలను చిన్న భాగాల్లో రెగ్యులర్‌గా తినడం వల్ల కీళ్ళ వాపు నుండి రిలీఫ్ అవ్వొచ్చు.

Also Read : Blood type food : మీ బ్లడ్ గ్రూప్ A అయితే.. వీటిని తింటే చాలా మంచిది..

​పండ్లు..

యాపిల్స్, క్రాన్ బెర్రీస్, ఆప్రికాట్ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

ఆంథోసైనిన్స్ పుష్కలంగా ఉన్న చెర్రీస్ తినడం వల్ల కీళ్ళు, కండరాలలో వాపుని తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉండొచ్చు.

​బోన్ బ్రోత్..

మటన్, చికెన్ పాయ తాగడం వల్ల మీ ఎముకల ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇందులో గ్లూకోసమైన్, కొండ్రోయిటిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల పెరుగుదలకు సాయపడతాయ. వేడి ఎముకల పులుసుని క్రమం తప్పకుండా తాగడం వల్ల కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందొచ్చు.

Also Read : Jowar recipes : జొన్న పిండితో వంటలు.. ఆరోగ్యానికి చాలా మంచిది..

​ఆలివ్ ఆయిల్..

ఆలివ్ ఆయిల్‌లో అన్‌శాచురేటెడ్, ఆరోగ్యకరమైన కొవ్వు, ఒమేగా 3 మూలం. ఆలివ్ నూనెలో ఒలియోకాంతల్ కూడా ఉంటుంది. ఇది మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ రోజువారీ ఆహారంలో ఆలివ్ నూనె చేర్చుకోండి. గుడ్లు వండేందుకు, సలాడ్స్‌లో ఉపయోగించడం మొదలైనవి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news