- ఆమ్ఆద్మీ: 145
- బీజేపీ: 94
- కాంగ్రెస్: 8
- ఇతరులు: 3
ఆప్‍కు ఊరట
Delhi MCD Exit Polls 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍లో విజయం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ సూచించడం ఆమ్‍ఆద్మీ పార్టీకి ఊరటగా ఉంది. ఎందుకంటే గుజరాత్‍లో ఆప్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఆ పార్టీకి గుజరాత్‍లో ఐదు స్థానాలు కూడా రావడం కష్టమేనని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ ఖాతా తెరవడం కూడా కష్టమేనని వెల్లడించాయి. ఇలాంటి తరుణంలో.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. తొలిసారి తమ వశమవుతుందని తేలడం సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీకి సానుకూల అంశంగా ఉంది. బీజేపీ కూడా ఈసారి ఎంసీడీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రచారాన్ని ముమ్మరంగా చేసింది. అయితే కేజ్రీవాల్.. ఇమేజ్ ఈసారి బాగా పని చేసిందని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది.