రావల్పిండి టెస్టులో ఓటమిపాలైన పాకిస్థాన్.. అంతకు ముందు సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులోనూ ఓడింది. దీంతో సొంత గడ్డ మీద ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లో టెస్టుల్లో ఓడిన రెండో పాక్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ నిలిచాడు. ఇంతియాజ్ అహ్మద్ సారథ్యంలో 1959లో ఆసీస్ చేతిలో ఓడిన పాక్.. 1961లో అతడి నాయకత్వంలోనే ఇంగ్లాండ్ చేతిలో టెస్టు మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో పాక్ ఓటమిపై అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానాంశాలు:
- రావల్పిండి టెస్టులో పాక్ ఓటమి
- ఇంతకు ముందు ఆసీస్ చేతిలో ఓటమి
- ఆసీస్, ఇంగ్లాండ్ చేతిలో టెస్టుల్లో ఓడిన రెండో పాక్ కెప్టెన్ బాాబర్
బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్ రూపొందిస్తే.. మ్యాచ్‌ను టైగా ముగించొచ్చనేది పాకిస్థాన్ వ్యూహం. కానీ ఇంగ్లాండ్ దూకుడైన బ్యాటింగ్.. సాహసోపేత నిర్ణయాలతో తొలి టెస్టును గెలుచుకుంది. పాక్ బ్యాటర్లు డ్రా కోసం చివరి వరకూ పోరాడినప్పటికీ.. ఇంగ్లిష్ బౌలర్లు ఆఖరి సెషన్లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించారు.
రావల్పిండి టెస్టులో పాక్ ఓటమి అభిమానులను అసంతృప్తికి గురి చేసింది. తమ జట్టు ఓటమిపై పాక్ జర్నలిస్ట్ ఒకరు ఘాటుగా ట్వీట్ చేశారు. సొంత గడ్డ మీద భారత్ టెస్టు విజయాలను ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్ పరువు తీశాడు. ‘2013 నుంచి సొంత గడ్డ మీద భారత్ కేవలం రెండు టెస్టుల్లోనే ఓడిపోయింది. ఈ కాలంలో టీమిండియా 42 టెస్టులు ఆడింది. ఇదో అద్భుతమైన రికార్డ్. భారత క్రికెట్ జట్టుకు 100 సమస్యలు ఉండొచ్చు కానీ సొంత గడ్డ మీద టెస్టు క్రికెట్లో డామినేట్ చేయడం మాత్రం అభినందనీయం అంటూ తొలి టెస్టులో పాక్ ఓటమిని పరోక్షంగా ప్రస్తావించాడు.
2010 నుంచి సొంత గడ్డ మీద భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. 2010 నుంచి 2021 మధ్య సొంత గడ్డపై 19 టెస్టు సిరీస్‌లు ఆడిన భారత్.. 17 సిరీస్‌లను సొంతం చేసుకుంది. 2012లో ఇంగ్లాండ్‌కు మాత్రమే సిరీస్‌ను కోల్పోయింది. అంతకు ముందు 2010లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను డ్రాగా ముగించింది. ఈ కాలంలో సొంత గడ్డ మీద భారత్ టెస్టు విజయాల శాతం 73 కాగా.. తర్వాతి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 65 శాతం విజయాలు సాధించింది.
పాకిస్థాన్ విషయానికి వస్తే.. 2022లో ఇంత వరకూ సొంత గడ్డ మీద టెస్టు విజయాన్ని అందుకోలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టులను డ్రాగా ముగించిన పాక్.. చివరి టెస్టులో ఓడింది. ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలోనూ ఓడింది. దీంతో సొంత గడ్డ మీద ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లో టెస్ట్ మ్యాచ్‌లు ఓడిన రెండో పాకిస్థాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ నిలిచాడు. గతంలో ఇంతియా అహ్మద్ నాయకత్వంలోని పాక్ సొంత గడ్డపై ఆస్ట్రేలియా (1959లో), ఇంగ్లాండ్ (1961లో)కు టెస్టులను కోల్పోయింది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.