Friday, March 31, 2023

rohit sharma apartment mumbai, Rohit Sharma: రెండు అపార్ట్‌మెంట్లు రెంట్‌కు తీసుకున్న రోహిత్ శర్మ.. నెలకు కట్టే అద్దె తెలిస్తే.. – cricketer rohit sharma puts two mumbai apartments on rent for rs 2.5 lakh per month


Rohit Sharma: టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ.. ముంబయిలో రెండు అపార్ట్‌మెంట్లను రెంట్‌కు తీసుకున్నాడు. ఇవి వరుసగా 616 చదరపు అడుగులు, 431 చదరపు అడుగులు ఉన్నాయి. బాంద్రా వెస్ట్‌లోని 14వ అంతస్తులో ఇవి ఉన్నాయి. మొత్తంగా 1047 చదరపు అడుగుల ఈ ఫ్లాట్ల కోసం రోహిత్ శర్మ ఏకంగా నెలకు రూ.2.5 లక్షల అద్దె చెల్లిస్తున్నాడట. ఈ మేరకు సంబంధిత డాక్యుమెంట్లను యాక్సెస్ చేసింది జాప్‌కీ. కామ్ (Zapkey.com). మొత్తం 12 నెలల కాలానికి రోహిత్ లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది.

ఈ అపార్ట్‌మెంట్‌లలో మంచి సదుపాయాలు ఉన్నట్లు Zapkey.com తెలిపింది. రెండు కార్లు పార్క్ చేసుకునే విధంగా సౌకర్యం ఉంది. రోహిత్ శర్మ.. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 10 లక్షలు చెల్లించినట్లు తెలిసింది. 2022 నవంబర్ 24న డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసినట్లు తెలిసింది.

గతేడాది రోహిత్ శర్మ.. లోనావ్లా హిల్ స్టేషన్‌లో రూ.5.25 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఇది 6329 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. ఈ ప్రాపర్టీ ప్రకారం చూస్తే ఒక చదరపు అడుగుకు రూ. 8300 కట్టినట్లు తెలిసింది. రూ.26 లక్షల స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించాడు హిట్ మ్యాన్.

రోహిత్ శర్మ టీమిండియా ప్రస్తుతం టాప్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక.. అతడిని వన్డే, టీ-20 పగ్గాల నుంచి కూడా తప్పించారు. తర్వాత అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు దక్కాయి. అప్పటినుంచి జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు హిట్ మ్యాన్. అయితే ఇటీవల టీ-20 వరల్డ్‌కప్‌లో మాత్రం సెమీఫైనల్లో ఓడి ఇంటిదారి పట్టింది భారత్. ప్రస్తుతం బ్యాటర్‌గా రోహిత్ ఫామ్ అంతేం బాగాలేదు.

ఉద్యోగులను పీకేసిన 20 దిగ్గజ కంపెనీలు.. దిక్కుతోచని స్థితిలో వేలమంది..భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. రూ.3600 జంప్.. 3 రోజుల్లోనే తలకిందులు!

ఇప్పటివరకు 45 టెస్టుల్లో రోహిత్ శర్మ 3137 పరుగులు చేశాడు. సగటు 46గా ఉంది. ఇక వన్డేల్లో 233 మ్యాచ్‌లు ఆడగా.. 9376 రన్స్ చేశాడు. యావరేజ్ 48.6గా ఉంది. ఇక టీ-20ల్లో 148 మ్యాచ్‌ల్లో 31.3 యావరేజ్‌తో 3853 పరుగులు చేశాడు. ఇక రోహిత్ వన్డేల్లో ఎవరికీ అందని రీతిలో 3 డబుల్ సెంచరీలు సాధించడం విశేషం.

మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ దశాబ్దకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. అత్యధికంగా ముంబయి ఇండియన్స్ జట్టుకు ఐదు సార్లు సారథిగా టైటిల్ అందించాడు రోహిత్. 2013,2015,2017,2019, 2020 సీజన్లలో ఐపీఎల్ టైటిల్ గెలిచింది ముంబయి ఇండియన్స్. తర్వాత చెన్నై జట్టు నాలుగు టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది. గతేడాది మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి, చెన్నై నిరాశపరిచాయి. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: పేటీఎంలో డబ్బులు పెట్టారా? అయితే మీకో గుడ్‌న్యూస్.. త్వరలోనే!



Source link

Latest news
Related news